ములుగు జిల్లాలో పొంగిపొర్లుతున్న జంపన్న వాగు.. పర్యాటక ప్రాంతాలు అన్నీ క్లోజ్

ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

Update: 2024-09-02 03:49 GMT

దిశ, వెబ్ డెస్క్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా అటవీ ప్రాంతంలో కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా ప్రధాన చెరువులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో.. మేడారం వద్ద ఉన్న జంపన్న వాగు దెయ్యాల వారు, జీడి వాగు భీకరంగా ప్రవహిస్తున్నాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే తాడ్వాయి-పస్రా మధ్య ఉన్న జాతీయ రహదారి తెగిపోయింది. దీంతో అప్రమత్తమైన అధికారులు పర్యాటక ప్రదేశాలు మూసివేశారు. ములుగు జిల్లాలో ఉన్న లక్నవరం, రామప్ప, బొగత జలపాతాలు మూసివేత వరద ముప్పు పై అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష చేశారు. అనంతరం వరద ముంపు ప్రాంతాల్లో సీతక్క పర్యటించారు.


Similar News