కేసీఆర్‌కేం తెలుసు.. చీల్చి చెండాడంలో మేమే ఎక్స్‌పర్ట్స్: జగ్గారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇచ్చామని.. ఇకపై కాంగ్రెస్‌ను చీల్చి చెండాడుతామని
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆరు నెలల సమయం ఇచ్చామని.. ఇకపై కాంగ్రెస్‌ను చీల్చి చెండాడుతామని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గురువారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగ్గారెడ్డి మాట్లాడుతూ.. మా దగ్గర రాజకీయాలు నేర్చుకున్న కేసీఆర్‌కు ఏం తెలుసు.. చీల్చి చెండాడటంలో మేమే ఎక్స్‌పర్ట్స్ అని దిమ్మతిరిగే రీతిలో రివర్స్ కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓ పాలసీ లేదు, విధానమూ లేదని బడ్జెట్‌పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు సైతం జగ్గారెడ్డి రివర్స్ కౌంటర్ ఇచ్చారు.
కాంగ్రెస్ బడ్జెట్ ప్రాక్టికల్ బడ్జెట్ అని.. ప్రభుత్వం వాస్తవిక పరిస్థితులతో కూడిన బడ్జెట్ ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు బడ్జెట్‌లో కేటాయింపులు ఉన్నాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్‌లో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తే.. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ మాత్రం అప్పులకు ప్రాధాన్యత ఇచ్చారని సెటైర్ వేశారు. బడ్జెట్‌లో రాష్ట్ర అభివృద్ధికి తొలి ప్రాధాన్యత ఇచ్చామని పేర్కొన్నారు.