టీపీసీసీకి జగ్గారెడ్డి వార్నింగ్.. సస్పెండ్ చేస్తే రోజుకొకరి బండారం బయట పెడతానంటూ..
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్‌లో జగ్గారెడ్డి వ్యవహారం రోజు రోజుకూ చర్చనీయాంశమవుతుంది. ఆదివారం
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్‌లో జగ్గారెడ్డి వ్యవహారం రోజు రోజుకూ చర్చనీయాంశమవుతుంది. ఆదివారం జగ్గారెడ్డితో ఏఐసీసీ అధికార ప్రతినిధులు అద్దంకి దయాకర్, మానవతారాయ్, బెల్లయ్య నాయక్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ షోకాజ్ నోటీసు ఇస్తే సమాధానం చెబుతానని, మమ్మల్ని సస్పెండ్ చేసే దమ్ము ఎవరికీ లేదన్నారు. ఒకవేళ తనని సస్పెండ్ చేస్తే రోజుకొకరి బండారం బయటపెడతానంటూ అధిష్టానాన్ని హెచ్చరించారు. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా రేవంత్ రెడ్డి పనిచేయడం లేదని ఆరోపించారు. అయితే, సంగారెడ్డి ఎమ్మెల్యేగా రాజీనామా చేయడానికి సిద్ధమని, స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి తన సత్తా చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థిని తన మీద పోటీ చేయించి గెలిపించుకోవాలని పీసీసీ చీఫ్ రేవంత్‌కి సవాలు విసిరారు. వేరే అభ్యర్థి గెలిస్తే.. రేవంత్ రెడ్డే హీరో అని ఒప్పుకుంటానన్నారు.