Jagga Reddy: కేసీఆర్ జాతీయ రాజకీయాలపై జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
Jagga reddy criticizes cm kcr over his national politics| తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఎటూ కాకుండా పోతారని విమర్శించారు
దిశ, వెబ్‌డెస్క్: Jagga reddy criticizes cm kcr over his national politics| తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఎటూ కాకుండా పోతారని విమర్శించారు. బీజేపీని బలోపేతం చేసే పనిలో కేసీఆర్ బీజీగా ఉన్నారని ఆరోపించారు. భారత్ రాష్ట్రీయ సమితి (బీఆర్ఎస్) పేరుతో దేశంలో పార్టీని ప్రారంభించి తెలంగాణ రాజకీయాన్ని బీజేపీ చేతిలో పెట్టాలని కేసీఆర్ అనుకుంటున్నారని జగ్గారెడ్డి విమర్శించారు. కేసీఆర్ కు ఎవరో తప్పుడు సలహాలు ఇస్తున్నారని, వాటిని అనుసరిస్తే ఆయన దెబ్బయిపోతారని అన్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ 200 ఎంపీ సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు.
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న టీఆర్ఎస్ కల కలగానే మిగిలిపోతుందని అన్నారు. 8 లోక్ సభ స్థానాల్లో ఉన్న టీఆర్ఎస్... 53 ఎంపీ స్థానాలు ఉన్న కాంగ్రెస్ పరిస్థితి అయిపోయిందని విమర్శించడం హాస్యాస్పదమన్నారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ కు ప్రస్తుతం ఉన్న 8 ఎంపీ సీట్లు కూడా దక్కవని చెప్పారు. కాంగ్రెస్ లేకుండా ముందుకు పోవాలనుకునే వారికి ఎదురుదెబ్బ తప్పదన్న జగ్గారెడ్డి.. అసలు కాంగ్రెస్ లేకుండా దేశంలో ప్రత్యామ్నాయం సాధ్యం కానే కాదని స్పష్టం చేశారు. శరద్ పవార్, దేవెగౌడ కంటే కేసీఆర్ ఏమైనా గొప్ప లీడరా? అని ప్రశ్నించారు. జాతీయ రాజకీయాల్లో తాడు బొంగరం లేని టీఆర్ఎస్ గురించి గొప్పలు చెప్పుకుంటూ కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
Also Read: 'ఆ విషయంలో కేసీఆర్‌ను కేటీఆర్ మించిపోయాడు'