కట్టి నాలుగేళ్లైనా...పంపిణీకి నోచుకోలే! (వీడియో)
డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ద్రోహం చేస్తుందని ఐఏఎస్ మాజీ అధికారి ఆకునూరి మురళి ఆరోపించారు.
దిశ, డైనమిక్ బ్యూరో : డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ద్రోహం చేస్తుందని ఐఏఎస్ మాజీ అధికారి ఆకునూరి మురళి ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పేదల కోసం డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి నాలుగేళ్లవుతున్నా వాటి పంపిణీకి మాత్రం నోచుకోవడం లేదని విమర్శలు గుప్పించారు. ఈ మేరకు బుధవారం ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేశారు. ప్రభుత్వం సూర్యాపేట జిల్లాలో సుమారు 500 డబుల్ ఇండ్ల ఫ్లాట్లను నిర్మించి 4 సంవత్సరాలు అవుతుందని, మున్సిపాలిటీ ఏరియాలో కూడా ఇండ్లను నిర్మించి నాలుగేళ్లైనా... వాటి పంపిణీ కార్యక్రమాలు మాత్రం ప్రభుత్వం చేపట్టడం లేదని మండిపడ్డారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉందన్నారు. ఇండ్లను నిర్మించి ఐదేళ్లు దాటినా కేసీఆర్కు పంపిణి చేయడానికి మనసు రావడం లేదన్నారు. కట్టించిన ఇండ్లను పేదవారికి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దీనిని ఎలక్షన్లలో ఏ రకండా వాడుకోవాలని చూస్తున్నారంటూ నిలదీశారు. ఇది చాలా దుర్మార్ఘపు పని అని.. మీ ఆలోచన విధానం దారుణంగా ఉందంటూ ఆకునూరి మురళి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఉన్న సుమారు లక్ష డబుల్ ఇండ్లను వెంటనే పేదలకు పంపిణీ చేయాలని సోషల్ డెమోక్రటిక్ ఫోరం(ఎస్డీఎఫ్) నుంచి డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు.