తెలుగు రాష్ట్రాల్లో IT Raids.. బడా వ్యాపారవేత్తలే టార్గెట్ ?

ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఆకస్మికంగా దర్యాప్తు సంస్థల తనిఖీలు కలకలం రేపుతున్నాయి.

Update: 2023-01-18 06:54 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ఇటీవల కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఆకస్మికంగా దర్యాప్తు సంస్థల తనిఖీలు కలకలం రేపుతున్నాయి. తాజాగా బుధవారం ఉదయం నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు సంచలనంగా మారాయి. ఏకకాలంలో 50కి పైగా ప్రాంతాల్లో 35 టీమ్ లతో ఐటీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ప్రముఖ రియల్ ఎస్టేట్, సినిమా పైనార్సియర్స్ ఇళ్లు, కార్యాలయాలే టార్గెట్ గా ఈ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. బంజారాహిల్స్ పీఎస్ పరిధిలో ఉన్న ఆదిత్య కన్ స్ట్రక్షన్ తో పాటు బిల్డర్ మాధవ రెడ్డి కార్యాలయం, నివాసంలో రెయిడ్స్ జరుగుతున్నాయి. ఊర్జిత ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, వీర ప్రకాష్ నివాసాలతో పాటు వారి కార్యాలయాల్లో కూడా సోదాలు కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. అయితే తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ వ్యాపారవేత్తలే టార్గెట్ గా సోదాలు జరుగుతుంటడం హాట్ టాపిక్ అయింది. ఆదాయ పన్నుల వ్యవహారాల లెక్కల్లో తేడాలు ఉండటంతోనే అధికారులు తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఈ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:    

Similar News