IT: పరిశ్రమల రంగానికి మహర్ధశ.. రాష్టానికి పెట్టుబడుల వెళ్లువ

తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వెల్లువెత్తాయి.

Update: 2024-12-08 16:08 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఆదివారం ఒక్క రోజే నాలుగు సంస్థల నుండి రూ.7,592 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. తద్వారా రాష్ట్రంలో 41 వేల మందికి ఉపాధి కల్పించబోతున్నాయి. ప్రజాపాలన విజయేత్సవాలలో భాగంగా ఆదివారం హైదరాబాద్​లోని పార్క్ హయత్​లో జరిగిన కార్యక్రమంలో ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్​బాబు ముఖ్య అతథిగా హాజరు కాగా, ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్​ రంజన్​, పరిశ్రమల శాఖ కమిషనర్ డా. మల్సూర్, టీజీ ఐఐసి మేనేజింగ్ డైరెక్టర్ డా. వి. విష్ణువర్ధన్ రెడ్డి, టిజిఐఐసి ఛైర్మన్​ నిర్మలా జగ్గారెడ్డి, ఐటి శాఖ సీనియర్​అధికారి భవియేష్​ విశ్రాల సమక్షంలో భూపతి రాజు (ఆజాద్ ఇంజనీరింగ్), అమిత్ చౌదరి (లెన్స్ కార్ట్), రేవతి రోహిణి ( ప్రీమియర్ ఎనర్జీస్) తదిరులు ఎంఓయూలను మార్చుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్​బాబు మాట్లాడుతూ లెన్స్​కార్టు సొల్యూషన్స్​ సంస్థ పెద్ద ఎత్తున 1500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చి ఎంఓయూ కుదుర్చుకుంటుండడం సుభపరిణామం అన్నారు. ఈ సంస్థ ద్వారా 1600 మందికి ఉపాధి లభించబోతోందని, అలాగే ప్రీమియర్​ ఎనర్జీ గ్లోబల్​ఎన్విరాన్​మెంటల్​ లిమిటెడ్​సంస్థ 3340 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిందని, ఈ సంస్థ ద్వారా వెయ్యి మందికి ఉపాధి లభించనుందన్నారు. అలాగే ప్రీమియర్​ ఎనర్జీ ప్రైవేట్​లిమిటెడ్​అనే ఇంటర్​నేషనల్​ సంస్థ 1960 కోట్ల రూపాయల పెట్టుబడులతో 1650 మందికి ఉపాధి కల్పించే దిశగా ఎంఓయూలు కుదుర్చుకున్నాయన్నారు. వీటితో పాటు ఆజాద్​సూపర్​ఆలోయ్స్​ ప్రైవేట్​ లిమిటెడ్​ సంస్థ 800 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందని, ఈ సంస్థ ద్వారా 600 మందికి ఉపాధి లభించబోతోందన్నారు. తాను ఇటీవల దావోస్​, అమెరికా తదితర దేశాలకు వెళ్లి పలువురిని పెట్టుబడులు పెట్టాలని కోరగా వారు ముందుకు వస్తున్నారన్నారు.

వ్యవసాయానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మరింతగా సత్పలితాలు సాధించేలా ప్రభుత్వం పలు రకాల చర్యలు తీసుకుంటోందని మంత్రి శ్రీధర్​బాబు అన్నారు. పరిశ్రమలకు సంబంధించిన పారిశ్రామిక వేత్తలు తెలంగాణ రాస్ట్ర ప్రగతిలో భాగం పంచుకునేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న క్రమంలో ఒక కొత్త ఒరవడిని తీసుకువచ్చేందుకు పలు యాప్​ను అందుబాటులోకి తెస్తున్నామన్నారు. సిఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రంలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామన్నారు. ప్రగతిని నిర్వచనంగా తీసుకుంటూ రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలను ఏర్పాటు చేయించాలని, ఇందుకోసం వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తేవాలన్నది తమ ప్రభుత్వ సంకల్పం అన్నారు. నూతన పరిశ్రమల ద్వారా తెలంగాణ వాసులకు ఉపాధి పెంచాలని ఇప్పటికే ముందుకు వెళుతున్నామని, ఇందుకు ఐటి శాఖ కూడ తమకు తోడ్పాటును అందిస్తూ పలు యాప్​లను అందుబాటులోకి తెచ్చిందన్నారు. ఏడాది ప్రగతి రిపోర్ట్​ను తీసుకువచ్చి ప్రజల ఆశీర్వాదం తీసుకుంటు ముందుకు వెళ్లనున్నామన్నారు. వ్యవసాయానికి సంబంధించి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆ రైతు సోదరులకు మెరుగైన సేవలందించాలని దిశగా ఒక యాప్​ను ఇప్పుడు ఆవిష్కరిస్తున్నమన్నారు. రైతులకు రుణమాఫీ చేయడంతో పాటు వారికి కావలిస మద్దతు ధరలు ఇప్పంచడం కోసం ప్రభుత్వం ఇప్పటికే కృషి చేస్తోందని, రైతులకు రుణాలు అందాలంటే వివిధ బ్యాంకులు నెల రోజుల సమయం తీసుకుంటున్న క్రమంలో కొన్ని బ్యాంకులు మాత్రం ముందుకు వస్తున్నాయన్నారు. అటు పోలీస్​ యంత్రాంగం కూడా యావత్​ రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ తెలంగాణగా మార్చేందుకు పలు చర్యలు తీసుకుంటున్నారని మంత్రి శ్రీధర్​బాబు వెల్లడించారు. ప్రైవేటు రంగంలో ఉన్న కాలేజీల విద్యార్ధులను డ్రగ్స్​కు దూరంగా ఉండేలా చూస్తున్నామన్నారు. ఈ దిశగా విద్యార్థుల తల్లిదండ్రులను తీసుకువచ్చి పలు సూచనలు చేస్తున్నామన్నారు. మీ సేవ ద్వారా ఉన్న సేవలను మరింతగా పెంచేందుకు కృషి చేస్తున్నామని, మీ సేవ ద్వారానే మైనారిటీ, ఇన్​కం, ఆదాయం తదితర సర్టిఫికెట్లు అందించేలా కృషి చేస్తున్నామని తెలిపారు.

తెలంగాణ ఫైబర్​గ్రిడ్​ద్వారా టి‌‌ ఫైబర్​సేవలు

తెలంగాణ ఫైబర్​గ్రిడ్​ద్వారా టి‌‌ ఫైబర్​సేవలను ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఆదివారం ప్రారంభించారు. దీని ద్వారా తక్కువ ధరకే ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తున్నారు. పైలట్ ప్రాజెక్టు కింద 3 జిల్లాల్లోని ఒక్కో గ్రామంలో 4 వేల కుటుంబాలకు కేబుల్ టీవీ, ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. పెద్దపల్లి జిల్లా అడవి శ్రీరాంపూర్, సంగారెడ్డి జిల్లా సంఘంపేట, నారాయణపేట్ జిల్లా కోడంగల్​నియోజకవర్గం మద్దూరు గ్రామాల్లో టీ ఫైబర్ నెట్ సర్వీసులు ప్రారంభం చేశారు. టీ ఫైబర్ సేవలపై సంగారెడ్డి జల్లా శ్రీరాంపూర్ వాసులతో మంత్రి ముచ్చటించారు. టీ ఫైబర్‌తో టీవీ, టెలివిజన్, కంప్యూటర్ సేవలకు ఉపయోగం ఉంటుందని మంత్రి తెలిపారు. చిన్న పరిశ్రమల కోసం కొత్త ఎమ్ఎస్ఎమ్‌ఈ పాలసీ తీసుకోచ్చామన్నారు. ఈ సేవలు కొన్ని సవరణల తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ప్రవేశపెట్టడానికి నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.

నేటి నుంచి మీ సేవలో మరిన్ని సేవలు..

అదేవిధంగా మంత్రి శ్రీధర్ బాబు మీ సేవ మొబైల్ యాప్‌ను ప్రారంభించారు. ఇందులో మరిన్ని సేవలను అందుబాటులోకి తెచ్చారు. మొబైల్ యాప్ ద్వారా 250కు పైగా సర్వీసులు లభ్యం అవుతాయని అధికారులు తెలిపారు. మరోవైపు రైతులకు రుణమాఫీ, బోనస్ కోసం మొబైల్ అప్లికేషన్ మంత్రి ప్రారంభించారు. కాగా మంత్రి శ్రీధర్‌ బాబు సమక్షంలో పలు సంస్థల మధ్య జరిగిన ఒప్పందాల ప్రకారం.. తెలంగాణలో రూ.1500 కోట్ల అంచనా వ్యయంతో లెన్స్‌కార్ట్‌ సంస్థ తాజాగా మ్యానిఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయనుంది. అలాగే సీతారాంపూర్‌లో సోలార్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటుకు ప్రీమియర్ ఎనర్జీ లిమిటెడ్ ఎంఓయూ కుదుర్చుకోగా, డిఫెన్స్ రంగంలో పెట్టుబడులకు ఆజాద్ ఇంజనీరింగ్ లిమిటెడ్ సంస్థ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం విశేషం .

Tags:    

Similar News