Women trafficking :పాతబస్తీలో గలీజ్‌దందా.. కాంట్రాక్ట్ పెళ్లిళ్ల కోసమేనా?
బ్రోకర్ సయ్యద్ హుస్సేన్అరెస్ట్ వ్యవహారంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దిశ, చార్మినార్ : మహిళల శరీర నగ్న చుట్టు కొలతల పట్టికను ప్రదర్శిస్తూ న్యూడ్ ఫొటోలు తీస్తూ పట్టుబడ్డ బ్రోకర్ సయ్యద్ హుస్సేన్అరెస్ట్ వ్యవహారంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కర్ణాటక నుంచి పాతబస్తీకి పక్కా ప్లాన్‌తో వచ్చి కాంట్రాక్ట్పెళ్లిళ్ల కోసం భర్త విడిచిపెట్టిన, భర్త చనిపోయి ఒంటరిగా నివసిస్తున్న నిరు పేద మహిళలను సయ్యద్ హుస్సేన్ టార్గెట్చేసేవాడు. సదరు మహిళల పేరు, అమ్మ పేరు, బ్లడ్ గ్రూప్, వయస్సు, బరువు, ఎత్తు, బ్రెస్ట్, నడుము సైజుల కొలతల వివరాలను ఓ కాగితం మీద రాయించేవాడు.
మహిళలను న్యూడ్‌గా చేసి కాగితం మీద రాసిన వివరాల నేమ్ ప్లేట్‌ను రెండు చేతులతో సదరు మహిళలు పట్టుకోగా సెల్‌ఫోన్‌తో ఫొటోలను చిత్రీకరించేవాడు. అప్పట్లో సయ్యద్ హుస్సేన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు తిరిగి పోలీసు కస్టడీకి తీసుకుని విచారించగా పలు కీలక విషయాలు వెలుగు చూశాయి. మహిళల ఫిజిక్ ఆధారంగా ధర ఫిక్స్ చేసే కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన ఓ వ్యక్తి వద్ద సయ్యద్‌హుస్సేన్ బ్రోకర్‌గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. అయితే కర్ణాటకలో ఇది వరకే రెండు పెళ్లిళ్లు చేసుకుని, ఎనిమిది మంది పిల్లలు ఉన్న సయ్యద్ హుస్సేన్‌కు పాతబస్తీ వట్టేపల్లితో పాటు ఇతర ప్రాంతాలలో దగ్గరి బంధువులు ఉన్నారు.
వాళ్ల సహకారంతో పక్కా ప్లాన్ప్రకారమే సయ్యద్ హుస్సేన్ బార్కాస్సలాల ప్రాంతానికి వచ్చాడు. చార్మినార్ప్రాంతంలో ఓ మహిళ సయ్యద్హుస్సేన్కు పరిచయమయ్యింది. పెళ్ళిళ్లు అయి భర్త వదిలిపెట్టిన, భర్త మృతిచెందిన మహిళలకు తన వద్దకు పంపిస్తే కాంట్రాక్ట్ పెళ్లిళ్లు చేసి కాసుల వర్షం కురిపిస్తానని నమ్మబలికాడు. దీంతో అతని మాటలు నమ్మిన పలువురు మహిళలు ఒక్కొక్కరుగా సయ్యద్‌హుస్సేన్ వద్దకు వచ్చే వారు. సదరు మహిళలకు ఇంతకుముందు ఏమైనా సర్జరీలు జరిగాయా? లేవా? అని తెలుసుకోవడానికి వారికి మాయమాటలతో బురిడీ కొట్టించి మహిళల శరీర సౌష్టవాన్ని తెలిపే కొలతలను తీసుకుని ముఖం కనిపించకుండా న్యూడ్ ఫొటోలను తీసుకునే వాడు.
సర్జరీలు అయిన మహిళలను సింపుల్‌గా రిజెక్ట్ చేసేవాడు. ఒక వేళ సర్జరీలు ఏమీ జరుగకుండా ఫిజిక్ నచ్చితే మీ పంట పండినట్టేనని నమ్మించేవాడు. న్యూడ్ఫొటోలను కర్ణాటకలోని బాస్‌కు పంపేవాడు. ఒక వేళ ఎవరైనా మహిళలు న్యూడ్‌గా ఒప్పుకోక పోతే ఇంతకు ముందు తీసిన నగ్న చిత్రాలను వారికి చూపించి బలవంతంగా ఒప్పించేవాడు. మరి కొంతమంది మహిళలను మీ ఫిజిక్అసలు పనికి రాదని రిజెక్ట్ కూడా చేశాడు.
మరి కొంత మంది మహిళలతో నువ్వు ఫ్రెష్‌గా స్నానం చేసి, మంచి బట్టలు వేసుకు రావాలని వెళ్ళగొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఒక వేళ గుల్బర్గాలోని తన ఉస్తాద్‌కు మీ ఫిజిక్ నచ్చితే అతను పాతబస్తీకి వచ్చి మరోమారు చూసుకుని నచ్చితే కాంట్రాక్ట్ పద్దతిలో పెళ్లిళ్లు జరిపిస్తాడని, అతను ఎక్కడికి చెబితే అక్కడికి వెళ్ళాల్సి ఉంటుందని తెలిపాడు. సదరు బాధిత మహిళలకు బ్రోకర్సయ్యద్హుస్సేన్ తన మాయ మాటలతో మభ్యపెట్టినట్లు తెలుస్తోంది. అప్పట్లో ఒక బాధిత మహిళ మాత్రం బ్రోకర్సయ్యద్ హుస్సేన్ గలీజ్ దందాను ఓ సామాజిక కార్యకర్త దృష్టికి తీసుకెళ్లింది.
దీంతో డిసెంబర్ 5న ఆమె చాంద్రాయణగుట్ట పోలీసులతో కలిసి డెకాయ్ఆపరేషన్ నిర్వహించారు. పోలీసుల ఎంట్రీతో బ్రోకర్సయ్యద్హుస్సేన్ వ్యవహారం బట్టబయలు అయ్యింది. అప్పట్లో సయ్యద్హుస్సేన్పై 417, 420, 453 క్లాస్(బి) సెక్షన్ కింద చాంద్రాయణగుట్ట పోలీసులు కేసును నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు. ఇంకా విచారణ జరగాల్సి ఉండడంతో కోర్టులో పిటీషన్‌దాఖలు చేసి సయ్యద్ హుస్సేన్‌ను పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. సయ్యద్‌హుస్సేన్ సెల్‌ఫోన్‌లో 9మంది మహిళల నగ్నచిత్రాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసును చాంద్రాయణగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చిన్నప్పుడు స్కూల్లో ఉపాధ్యాయులు వేసిన శిక్షలు - వాటికి అర్థాలు