‘దివ్యాంగురాలికి ఉద్యోగం ఇస్తే విమర్శలా..?’

కాంగ్రెస్ పార్టీ పవర్‌లోకి వచ్చిన తర్వాత ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగుల సోదరి రజినీకి ఉద్యోగం ఇస్తే, విమర్శిస్తారా? అంటూ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య పేర్కొన్నారు.

Update: 2024-06-24 14:34 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ పవర్‌లోకి వచ్చిన తర్వాత ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగుల సోదరి రజినీకి ఉద్యోగం ఇస్తే, విమర్శిస్తారా? అంటూ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య పేర్కొన్నారు. ఆదివారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మందకృష్ణ బీజేపీ ఏజెంట్ అన్నారు. సీఎంను కించపరిస్తే ఊరుకోబోమన్నారు. రాజకీయ పబ్బం, స్వార్ధ రాజకీయాల కోసం వికలాంగులను వాడుకోవద్దని సూచించారు. మందకృష్ణ వికలాంగులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

పదేళ్లలో కేసీఆర్, మోడీ వైఫల్యాలపై ప్రశ్నించని మంద కృష్ణ , కాంగ్రెస్‌ను విమర్శించడం ఎంత వరకు కరెక్ట్ అని మండిపడ్డారు. గడిచిన పదేళ్లలో వికలాంగుల యాక్ట్‌కి కమిషనర్లను నియమించలేదంటేనే పరిస్థితిని అర్ధం చేసుకోవచ్చన్నారు. కేంద్ర సర్వీస్ ఉద్యోగాలకు వికలాంగులు పనికిరారని బీజేపీ ఏకంగా చట్టమే చేసిందన్నారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో వికలాంగుల ఆత్మహత్యలు జరిగాయని, కానీ మంద కృష్ణ వాటిపై ఎన్నడూ మాట్లాడలేదన్నారు. బీజేపీకి అమ్ముడు పోయి, కాంగ్రెస్‌పై విమర్శిస్తూ, వికలాంగుల మధ్య చిచ్చుపెడితే సహించేది లేదని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నరసింహ చారి, సతీష్ గౌడ్, మధ్యపాక సురేష్, నరేష్​ తదితరులు పాల్గొన్నారు.


Similar News