Bonalu : లష్కర్ బోనాల ఉత్సవాలకు రావాలని సీఎం రేవంత్‌కు ఆహ్వానం
ఆషాఢ మాసం సందర్భంగా తెలంగాణలో బోనాల సందడి నెలకొంది. ఈ నెల 21, 22 తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాల జాతరను నిర్వహించనున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ఆషాఢ మాసం సందర్భంగా తెలంగాణలో బోనాల సందడి నెలకొంది. ఈ నెల 21, 22 తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి లష్కర్ బోనాల జాతరను నిర్వహించనున్నారు. అయితే, ఈ బోనాల ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఇవాళ సచివాలయంలో సీఎం అర్చకులు, అధికారులు భేటీ అయ్యారు.
ఈ నేపథ్యంలోనే సీఎంకు ఆహ్వాన పత్రిక అందించి శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా రాజ్యసభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి గద్వాల్ దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమిషనర్ ఎం.హనుమంతరావు తదితరులు ఉన్నారు.