కాళేశ్వరంపై విచారణ స్పీడ్‌అప్.. జస్టిస్ పీసీ ఘోష్ నివేదికపై ఉత్కంఠ

కాళేశ్వరం ప్రాజెక్టు విచారణను జస్టిస్ పీసీ ఘోష్ స్పీడ్ అప్ చేశారు.

Update: 2024-06-06 05:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టు విచారణను జస్టిస్ పీసీ ఘోష్ స్పీడ్ అప్ చేశారు. రేపు, ఎల్లుండి సుందిళ్ల, అన్నారం బ్యారేజీలను పరిశీలించనున్నారు. ఈ నెల 20 వరకు హైదరాబాద్‌లో జస్టిస్ పీసీ ఘోష్ విచారణ చేపట్టనున్నారు. కాళేశ్వరంపై ఈ నెలాఖరుకు జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఇవ్వనున్నారు. రేపు మేడిగడ్డకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెళ్లనున్నారు. ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు చేపడుతున్న చర్యలు, పరీక్షలను పరిశీలించనున్నారు. కాగా, మేడిగడ్డ బ్యారేజీలో దెబ్బతిన్న ఏడో బ్లాక్ పరిధిలో నిపుణుల బృందం పరీక్షలను ఇప్పటికే ప్రారంభించింది. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ కమిటీ సూచనల మేరకు నిపుణులు పరీక్షలు చేసి బ్యారేజీపై పూర్తి నివేదిక ఇవ్వనున్నారు.


Similar News