కుక్కలను చంపాలంటే చట్టం సరే.. మరి దోమలకు ఏమైంది..?
కుక్కలు, కోతులను చంపాలంటే ప్రత్యేక చట్టాలు అవసరం కానీ, దోమలను చంపేందుకు ఏం అవసరం అధ్యక్షా..? అంటూ ఎమ్మెల్సీ ప్రభాకర్ ఫైర్ అయ్యారు.
దిశ, తెలంగాణ బ్యూరో: కుక్కలు, కోతులను చంపాలంటే ప్రత్యేక చట్టాలు అవసరం కానీ, దోమలను చంపేందుకు ఏం అవసరం అధ్యక్షా..? అంటూ ఎమ్మెల్సీ ప్రభాకర్ ఫైర్ అయ్యారు. బుధవారం ఆయన శాసనమండలిలో మాట్లాడుతూ... దోమల వలన గ్రేటర్ హైదరాబాద్‌లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. డెంగీ వ్యాధి వ్యాప్తి చెందుతుందన్నారు. కానీ వైద్యారోగ్యశాఖ అధికారులు అవగాహన కార్యక్రమాలు చేయడం లేదన్నారు. వ్యాధులు వ్యాప్తి చెందుతున్నా, చలనం లేకపోవడం దారుణమన్నారు. సీజనల్ యాక్షన్ ప్లాన్‌లు వంటివేమీ లేవన్నారు. ప్రభుత్వం ఆ దిశగా ఆదేశాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. లేకుంటే డెంగీ, మలేరియాలు ఔట్ బ్రేక్ అయ్యే ప్రమాదం ఉన్నదన్నారు.