Instagram Love: ఇన్‌స్టాగ్రామ్ ఎఫెక్ట్.. తల్లికి షాకిచ్చిన కూతురు..
ప్రస్తుతం చిన్నపిల్లలకు ఫోన్‌లు తీసివ్వడం స్టేటస్‌గా భావిస్తున్నారు.
దిశ వెబ్ డెస్క్: ప్రస్తుతం చిన్నపిల్లలకు ఫోన్‌లు తీసివ్వడం స్టేటస్‌గా భావిస్తున్నారు. కాని తెలిసీతెలియని వయసులో ఉన్న పిల్లలకు ఫోన్ ఇస్తే ఆ పిల్లలు చెడుకు ఆకర్షితులు అయ్యే అవకాశం ఉందనే విషయాన్ని చాలామంది తల్లిదండ్రులు ఆలోంచడం లేదు. ప్రపంచాన్ని అరచేతిలో చూపించే మొబైల్ ఫోన్‌లను పిల్లల చేతిలో పెడుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆ పిల్లలు సోషల్ మీడయాలో ముక్కుమొహం తెలియని వ్యక్తులతో పరిచయాలు ఏర్పరుచుకుని, ప్రేమాయణాలు సాగిస్తూ ఇల్లు వదిలివెళ్లిపోతున్నారు. గంతంలో ఇలాంటి ఘటనలు కోకొల్లలు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్డు నెంబర్–11లోని ఉదయ్‌నగర్‌కు చెందిన ఓ బాలిక (14) ఎనిమిదో తరగతి పూర్తి చేసింది.
కాగా ఆ బాలిక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేది. ఈ నేపథ్యంలో ఆ బాలికకు ఇన్‌సాగ్రామ్‌లో జహ్రనగర్‌కు చెందిన సైఫ్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఈ క్రమంలో ఆ బాలిక తన స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నానంటూ ఈ నెల 17వ తేదీన తన తల్లికి ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అయితే ఈ నెల 22న ఆ బాలిక సైఫ్‌ను పెళ్లి చేసుకున్నానని, ముంబయ్‌లో ఉన్నానని, ఇద్దరూ కలిసి దిగిన ఫొటోను మరోసారి ఇన్‌స్టాలోనే తల్లికి తెలిపింది.
కూతురు ఇచ్చిన షాక్‌తో కంగుతిన్న ఆ తల్లి పోలీసులను ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో తన కూతురు కొంతకాలంగా జహ్రనగర్‌కు వెళ్తుండేదని, సైఫ్ అనే యువకుడు ఇన్‌స్టాలో పరిచయం అయ్యాడని, కాగా ఈ నెల 17వ తేదీన తన స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నానని చెప్పివెళ్లిన తన కూతురు అతనితో వెళ్లిన విషయాన్ని ఇన్‌స్టాలో పోస్ట్ చేసి చెప్పిందని బాధిత తల్లి బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా తల్లి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.