AP స్పీకర్ తమ్మినేని అడ్మిషన్‌పై విచారణ జరపాలి: TNSF డిమాండ్

ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం డిగ్రీ లేకుండా 3 ఏళ్ల ఎల్ఎల్‌బీ కోర్సులో ఎలా అడ్మిషన్ ఇచ్చారో విచారణ జరపాలని, అడ్మిషన్‌కు సహకరించిన ఓయూ అధికారులపై చర్యలు తీసుకోవాలని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ నాయకులు డిమాండ్ చేశారు.

Update: 2023-04-03 17:15 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం డిగ్రీ లేకుండా 3 ఏళ్ల ఎల్ఎల్‌బీ కోర్సులో ఎలా అడ్మిషన్ ఇచ్చారో విచారణ జరపాలని, అడ్మిషన్‌కు సహకరించిన ఓయూ అధికారులపై చర్యలు తీసుకోవాలని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. ఓయూ లా కళాశాలలో జరిగే అక్రమాలపై విచారణ జరిపించాలని ఓయూ వైస్ ఛాన్స్‌లర్‌కు సోమవారం వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా టీఎన్ఎస్ఎఫ్ నాయకులు మాట్లాడుతూ.. డిగ్రీ డిస్ కంటిన్యూడ్ చేసినట్లు సీతారాం స్వయంగా టీవీ ఇంటర్వ్యూలలో చెప్పారని.. అయితే డిగ్రీ లేకుండానే ఎల్ఎల్‌బీ ఎలా చేస్తున్నారనే దానిపై అత్యున్నత స్థాయి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకా యూనివర్సిటీలో ఎన్ని అక్రమాలు జరిగాయో విచారణ చేపట్టాలని, నిబంధనలకు విరుద్ధంగా పట్టాలు పొందిన, అందుకు సహకరించిన వారిపై చర్యలు తీసుకోవాలని, ఇలాంటివి భవిష్యత్‌లో జరుగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కమిటీ నాయకులు పర్లపల్లి రవిందర్, సవిందర్, శివ, డీజేశివగౌడ్, సాయిబాబా, టి.అమరేందర్, హరికృష్ణ, శివానందన, హరి, శ్యాం తదితరులున్నారు.

Tags:    

Similar News