వినూత్న ప్రయత్నం.. బంగారంతో జాతీయ జెండా

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా స్వతంత్ర్య వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు.

Update: 2022-08-14 12:13 GMT

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా స్వతంత్ర్య వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను వివిధ రకాల వస్తువులపై తయారు చేస్తూ దేశ భక్తిని చాటుతున్నారు. బంగారం వెండితో కూడా జాతీయ జెండాను తయారుచేసి తమ దేశంపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు. తాజాగా.. నిర్మల్‌లో స్వర్ణకారుడు బంగారు జాతీయ జెండాను తయారు చేశారు. నిర్మల్ పట్టణంలోని గాంధీ చౌక్ చెందిన రామోజీ నరేష్ ఈ బంగారు జెండాను తయారు చేశారు. 400 మిల్లీ పాయింట్ల బంగారంతో దీనిని తయారు చేయగా.. దీని ధరను రూ.3 వేలుగా ఖరారు చేశారు. బంగారు జెండాలను గాంధీచౌక్‌లోని తమ షాపులో విక్రయిస్తున్నామని తెలిపారు.


Similar News