చర్లపల్లి జైల్లో ఖైదీలకు బగారా.. చికెన్​

పై సంపాదనలకు మరిగిన చెయ్యి ఊరికే ఉంటుందా?.. పదిమందికి ఈ ప్రశ్న వేస్తే పదిమంది ఊరుకోదనే సమాధానమిస్తారు.

Update: 2023-07-17 16:12 GMT

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: పై సంపాదనలకు మరిగిన చెయ్యి ఊరికే ఉంటుందా?.. పదిమందికి ఈ ప్రశ్న వేస్తే పదిమంది ఊరుకోదనే సమాధానమిస్తారు. జైళ్లశాఖలో జరుగుతున్న వ్యవహారాలు ఇలానే ఉన్నాయి. జైళ్లలో బిర్యానీ పేర జరుగుతున్న అక్రమాలను ‘దిశ’ వెలుగులోకి తీసుకు రాగా ఉన్నతాధికారులు కొన్నాళ్లపాటు ఖైదీలకు బిర్యానీ అమ్మవద్దంటూ మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. కాగా చర్లపల్లి సెంట్రల్​ జైలులో హెడ్​ వార్డర్ స్థాయిలో ఉన్న ఓ అధికారి వెట్​ క్యాంటీని ద్వారా డబ్బు సంపాదించటానికి సరికొత్త దారి కనుక్కున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో బగారా రైస్, చికెన్ కర్రీని నూటా నలభై నుంచి నూటా అరవై రూపాయల వరకు ఖైదీలకు అమ్ముతున్నట్టుగా విశ్వసనీయంగా తెలిసింది.

గమనించాల్సిన అంశం ఏమిటంటే నూటా నలభై నుంచి నూటా అరవై రూపాయలను ఖైదీల నుంచి వసూలు చేస్తూ రెండు నుంచి మూడు చికెన్​ ముక్కలు ఖైదీలకు ఇస్తుండటం. ఇక జైలు వర్గాల ద్వారా అందిని సమాచారం ప్రకారం బిర్యానీ అమ్మవద్దని పై అధికారుల మౌఖిక ఆదేశాలు ఉన్నా సదరు హెడ్​ వార్డర్ బిర్యానీ కూడా వండించి అమ్మతున్నట్టుగా తెలుస్తోంది. తిలా పాపం తలా పిడికెడు అన్నట్టుగా ఎవరి వాటాలు వారికి అందుతుండటం వల్లనే జైళ్లలో కొనసాగుతున్న ఈ దందాకు అడ్డుకట్ట పడటం లేదని ఆ శాఖకు చెందినవారే చెబుతుండటం గమనార్హం.

Tags:    

Similar News