హెచ్‌సీఏ × సర్కార్.. తీవ్రరూపం దాల్చిన పంచాయితీ!
ఇండియా vs ఆస్ట్రేలియా టీ–20 క్రికెట్ మ్యాచ్టికెట్ల వ్యవహారం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ)కు రాష్ట్ర సర్కార్మధ్య పంచాయితీ పెట్టింది.
దిశ, తెలంగాణ బ్యూరో: ఇండియా vs ఆస్ట్రేలియా టీ–20 క్రికెట్ మ్యాచ్టికెట్ల వ్యవహారం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్ సీఏ)కు రాష్ట్ర సర్కార్మధ్య పంచాయితీ పెట్టింది. దీంతో మంత్రి శ్రీనివాస్గౌడ్హెచ్ సీఏపై తీవ్రంగా మండిపడ్డారు. టికెట్ల విషయంలో జింఖానా గ్రౌండ్స్‌లో జరిగిన ఘటన దురదృష్టకరమని వ్యక్తం చేశారు. గురువారం మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి మంత్రి మాట్లాడారు. టికెట్ల పంపిణీపై హెచ్‌సీఏ పారదర్శంగా ఉండాలని, అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ఇస్టానుసారంగా వ్యవహరిస్తామంటే నడవదని సూచించారు. స్టేడియం తెలంగాణలోనే ఉందనే విషయం మరవొద్దని గుర్తు చేశారు. మ్యాచ్అయిపోయాక హెచ్‌సీఏ సంగతి తేల్చుతామని స్పష్టంచేశారు. ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందిస్తూనే కొత్త రూల్స్తెస్తామని పేర్కొన్నారు. మ్యాచ్‌కు పది రోజుల కిందటే టికెట్ల పంపిణీ పూర్తి కావాలని, కానీ హెచ్‌సీఏ మొండివైఖరితో ముందుకు వెళ్తుందని విమర్శించారు. హెచ్‌సీఏ అలాగే ఉంటానంటే ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుందని, అవసరమైతే ఉప్పల్‌స్టేడియం మెయింటనెన్స్‌ను కొత్త సంస్థకు ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం వెనకాడదని తేల్చి చెప్పారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటన లు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నదన్నారు. జింఖానా గ్రౌండ్‌లో వారికి ఉచితంగా హెచ్‌సీఏ ఆధ్వర్యంలోనే వైద్య సేవలు అందిస్తామన్నారు.
కాంప్లీమెంటరీ పాసుల కోసమే మంత్రి కామెంట్
ఆఫీసుల్లో కూర్చొని రివ్యూలు చేసినంత ఈజీగా మ్యాచ్‌ను మానిటరింగ్ చేయలేమని హెచ్‌సీఏ చైర్మన్అజారుద్దీన్పేర్కొన్నారు. జింఖానా ఘటన దురదృష్టమేనని, కానీ, ఏం జరిగిందనే అంశంపై నివేదిక అందిస్తామని వెల్లడించారు. లోపాన్ని సవరించుకుంటామని తెలిపారు. మ్యాచ్ నిర్వహణను ఎప్పుడూ నెగిటివ్ కోణంలో చూడొద్దని సూచించారు. అనుకోని ఘటనలు జరిగినప్పుడు ఎవరూ ఏమీ చేయలేరని పేర్కొన్నారు. బాధితులకు హెచ్‌సీఏ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా, మంత్రి సీరియస్కావడంపై.. కాంప్లిమెంటరీ పాస్‌ల కోసమే ఆరాట పడుతున్నట్లు హెచ్‌సీఏ సభ్యులు విమర్శించారు. టీఆర్ఎస్నేతల నుంచి పాస్‌ల ఒత్తిడి పెరగడంతో హెచ్‌సీఏ పై ఆగ్రహం వ్యక్తం చేశారంటూ కొందరు హెచ్‌సీఏ సభ్యులు పేర్కొన్నారు.
Also Read : వేడెక్కిన క్రికెట్ రాజకీయం.. 3 గంటలకు మీడియా ముందుకు అజారుద్దీన్