India Celebrates 77th Independance Day : చరిత్ర, ప్రాముఖ్యత ఇదే..!

77వ స్వాతంత్ర వేడుకలకు యావత్ భారతావని సిద్ధమవుతోంది.

Update: 2023-08-14 07:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: 77వ స్వాతంత్ర వేడుకలకు యావత్ భారతావని సిద్ధమవుతోంది. స్వాతంత్ర వేడుకలను అట్టహాసంగా జరపడానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. జాతీయ పతాకాన్ని ఎగరవేసి, నేషనల్ ఆంథామ్ పాడ స్వాతంత్ర వేడుకలను ప్రతి ఏడాది జరుపుకుంటున్నాం. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సాంస్కృతిక, దేశ భక్తి పెంపొందిచే కార్యక్రమాలను చేపడుతారు. స్కూళ్లు, పాఠశాలల్లో పాటల పోటీలు, క్విజ్ కాంపిటేషన్లు, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తారు.

స్వాతంత్ర పోరాట చరిత్ర ఇలా..

బ్రిటీష్ పాలకులు 150 ఏళ్ల క్రితం భారత దేశానికి ఈస్ట్ ఇండియా కంపెనీ పేరిట వచ్చారు. 1619లో గుజరాత్ రాష్ట్రం సూరత్ లో ట్రేడింగ్ కంపెనీ ఏర్పాటు చేశారు. 1757లో ఈస్ట్ ఇండియా కంపెనీ ప్లెస్సీ యుద్ధానంతరం భారత దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. మహాత్మా గాంధీ, భగత్ సింగ్, సర్దార్ వల్లాభాయ్ పటేల్, జవహార్ లాల్ నెహ్రు, సుభాష్ చంద్రబోష్, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి మరెంతో మంది వీరుల పోరాటంతో భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించింది. క్విట్ ఇండియా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన వేళ 1947లో భారతదేశం స్వేచ్ఛా బావుట ఎగరవేసి.. స్వాతంత్రాన్ని సొంతం చేసుకుంది.

ఇండిపెండెన్స్ ప్రాముఖ్యత..

1947 ఆగస్టు 15న ఆనాటి ప్రధాన మంత్రి జవహార్ లాల్ నెహ్రు జాతీయ పతాకాన్ని ఢిల్లీలోని ఎర్రకోటపై ఎగరవేశారు. ప్రతి ఏడాది స్వాతంత్ర దినోత్సవ పర్వదినాన ఈ అనవాయితీ కొనసాగుతోంది. అనంతరం దేశాన్ని ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు. బ్రిటీష్ హౌస్ ఆఫ్ కామన్స్‌లో 1947 జులై 14న ఇండియన్ ఇండిపెండెన్స్ బిల్లును ప్రవేశపెట్టారు.

Read More : ఆగస్టు 15న స్వాతంత్రం జరుపుకునే 5 దేశాలివే..!


Similar News