పార్లమెంట్ నూతన భవనం ప్రారంభం.. BRSకు 19 ప్రతిపక్ష పార్టీలు షాక్
పార్లమెంట్ నూతన భవన ప్రారంభోత్సవానికి బీఆర్‌ఎస్ వెళ్తుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
దిశ, వెబ్‌డెస్క్: కేంద్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి బీఆర్ ఎస్ వెళ్తుందా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పటికే 19 విపక్ష పార్టీలు పార్లమెంట్ భవన ఇనాగరేషన్ ప్రొగ్రాంకు దూరంగా ఉండాలని నిర్ణయించాయి. అయితే విపక్షాల పేరుతో రిలీజైన ప్రకటనలో బీఆర్ఎస్ పేరు కనిపించకపోవడంతో ఈ అంశం సెన్షేషనల్ గా మారింది. ప్రతిపక్ష పార్టీలన్ని కలిసి చేసిన ఉమ్మడి ప్రకటనలో బీఆర్ఎస్ పార్టీ లేకపోవడంతో కేసీఆర్ కు ఊహించని షాక్ తగిలింది. కాంగ్రెస్ గ్రూప్‌లో ఉండటం ఇష్టం లేక బీఆర్ఎస్ సొంతంగా నిర్ణయం ప్రకటించాలని భావిస్తుందా అనే అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మొదటి నుంచి బీఆర్ఎస్ సెంట్రల్ విస్టాకు అంబేడ్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేస్తోంది. తమ నిర్ణయాన్ని బీఆర్ఎస్ రేపు ప్రకటిస్తామని ప్రకటించింది.