HYD: సచివాలయం పరిధిలో 144 సెక్షన్‌ విధింపు

రాష్ట్ర ప్రభుత్వం(State Govt) కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయ(Telangana Secretariat) ప్రాంతంలో ఆంక్షలు విధించింది.

Update: 2024-11-11 14:02 GMT
HYD: సచివాలయం పరిధిలో 144 సెక్షన్‌ విధింపు
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం(State Govt) కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయ(Telangana Secretariat) ప్రాంతంలో ఆంక్షలు విధించింది. సచివాలయం నుంచి 500 మీటర్ల పరిధిలో 144 సెక్షన్‌(144 Section) విధించింది. ధర్నాలు, ర్యాలీలను నిషేధించింది. ఇందిరాపార్క్‌(Indira Park)లో ధర్నాలు, ర్యాలీలు తీసుకోవచ్చని పోలీసులు(City Police) అనుమతి ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. ఇటీవలే సచివాలయంలో వాస్తు మార్పులు చేసిన విషయం తెలిసిందే. లుంబిని పార్క్ ఎదురుగా ఉన్న ప్రధాన గేట్‌ను శాశ్వతంగా మూసివేసింది. ఎన్టీపార్క్ వైపు ఈశాస్యంలో మరో గేటు నిర్మాణం చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ గేటు నుంచే ముఖ్యమంత్రి, మంత్రులు సచివాలయంలోకి వెళ్లనున్నారు. ఇక సౌత్ ఈస్ట్, నార్త్ ఈస్ట్ గేట్లను కలుపుతూ 27 ఫీట్లతో రోడ్డు మార్గాన్ని నిర్మించడానికి అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News