హుస్సేన్ సాగర్‌లో గణేష్ నిమజ్జనాలు చేయొద్దు: హైకోర్టు

గణేష్ నిమజ్జనాలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌‌తో పాటు నగరంలో ఉన్నటువంటి చెరువుల్లో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయరాదని ఆదేశించింది.

Update: 2023-09-25 07:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: గణేష్ నిమజ్జనాలపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌‌తో పాటు నగరంలో ఉన్నటువంటి చెరువుల్లో పీవోపీ విగ్రహాలను నిమజ్జనం చేయరాదని ఆదేశించింది. పీవోపీ విగ్రహాలను కృత్రిమ నీటి కుంటలో నిమజ్జనం చేయాలని సూచించింది. వెంటనే హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని నగర సీపీ ఆనంద్‌కు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు సోమవారం ఆదేశాలు జారీ చేసింది. కాగా, నగరంలో ఇప్పటికే గణేశ్ నిమజ్జనాలు ఊపందుకున్నాయి. ఈనెల 18న గణేష్ చతుర్థి రోజు కొలువుదీరిన గణనాథులకు భక్తులు వీడ్కోలు పలుకుతున్నారు. హైదరాబాద్ నగరంలో దాదాపు లక్ష మండపాటు ఏర్పాటు చేయడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

Tags:    

Similar News