IIM : తెలంగాణకు ఐఐఎం ఇవ్వలేం : కేంద్రం

Update: 2024-12-03 12:03 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana)కు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ (IIM) ఇవ్వలేమని కేంద్ర ప్రభుత్వం(Central Government)పార్లమెంటు వేదికగా తేల్చిచెప్పింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం ఐఐఎం ఏర్పాటుకు ప్రణాళిక ఉందా? అని కాంగ్రెస్ సభ్యుడు బలరాంనాయక్ లోక్ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ నిర్ధిష్టంగా స్పందించలేదు. ఇప్పటికే చాలా కేంద్ర విద్యాసంస్థలు ఉన్నందున.. ఐఐఎం ఏర్పాటు చేయలేమని సమాధానమిచ్చారు.

అయితే రాష్ట్రంలో ఉన్న హైదరాబాద్ యూనివర్సిటీ, ఐఐటీ హైదరాబాద్, ఇఫ్లూ, మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ వంటి విద్యాసంస్థలను కేంద్రం నిర్వహిస్తుందని చెప్పారు. అదనంగా ములుగు జిల్లాలో రూ.890 కోట్లతో సమక్క-సారక్క కేంద్ర గిరిజన వర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. 

Tags:    

Similar News