కేసీఆర్ పార్టీలో ఉండాలంటే బానిసగా బతకాలి.. కొండా విశ్వేశ్వర్ కామెంట్స్

కేసీఆర్ పై కొండా విశ్వేశ్వర్ విమర్శలు గుప్పించారు.

Update: 2024-04-21 13:34 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలు చేశారు. కొత్త సీఎంకు ఖాళీ చిప్ప చేకికిచ్చాడని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పార్టీలో ఉండాలంటే బానిసగా బతకాలని అందుకే ఆత్మగౌరవంతో బయటకు వచ్చానన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పై పోరాడలేదని ఆనాడు బీజేపీలో చేరానని చెప్పారు. నాది వ్యక్తిగత స్వార్థం కోసం పార్టీలు మారే నైజం కాదు అన్నారు. తాజాగా ఓ టీవీ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తాను ఎంపీగా ఉన్న సమయంలో చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో తాను అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశానని గుర్తు చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నేనూ బాధితుడిని, డబ్బులు సంపాదించుకోవడం కోసం రాజకీయాల్లోకి రాలేదని, ఉద్యోగం, వ్యాపారంతో డబ్బు సంపాదించుకున్న తరువాతే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. అభివృద్ది ఎజెండాగా రాజకీయాలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. బీజేపీ హామీల అమలు గురించి ముందు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల గురించి మాట్లాడాలన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు కాంగ్రెస్ థింక్ ట్యాంక్, రాహుల్ గాంధీ రూపొందించలేదని ఓ కిరాయి స్ట్రాటజిస్ట్ చెప్పిన హామీలను ప్రకటించారని హాట్ కామెంట్స్ చేశారు.

Tags:    

Similar News