ఎమ్మెల్యేని ప్రశ్నిస్తే.. గిరిజనుడిని హింసించడం బాధాకరం: హరీష్ రావు

పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని ప్రశ్నించినందుకు యువకుడిని దారుణంగా కొట్టారని యువకుడి తల్లి ఆరోపించింది.

Update: 2024-07-11 11:42 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డిని ప్రశ్నించినందుకు యువకుడిని దారుణంగా కొట్టారని యువకుడి తల్లి ఆరోపించింది. తన కొడుకుకి ఏమైన అయితే ఎస్ఐదే బాధ్యత అని, తోర్రుర్ ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని యువకుడి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ క్రమంలోనే ఆయన ట్వీట్ చేస్తూ.. సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించినందుకు మాలోత్ సురేష్ కుమార్ అనే గిరిజనుడిని హింసించడం బాధాకరమన్నారు.

తొర్రూరు పోలీసుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. ఆ తల్లి ఆవేదనను అర్థం చేసుకోవాలని, ఈ ఘటనపై తెలంగాణ డీజీపీ విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోకాల్డ్ కాంగ్రెస్ ప్రజా పాలనలో ప్రశ్నించే గొంతులను నొక్కేస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారని తెలంగాణ డీజీపీకి ట్విట్టర్ వేదికగా ట్యాగ్ చేశారు.

Tags:    

Similar News