ఢిల్లీలో హైకమాండ్ ను కలిస్తే..ఇక్కడ కేసులు మాఫీ : బండి సంజయ్

రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని అసలైన నిందితులను వదిలేసి అమాయకులను అరెస్టు చేస్తున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు.

Update: 2024-11-17 09:57 GMT

దిశ, సంగారెడ్డి : రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తున్నాయని అసలైన నిందితులను వదిలేసి అమాయకులను అరెస్టు చేస్తున్నారని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఆదివారం సంగారెడ్డిలో విలేకర్ల సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ…” లగచర్లలో కలెక్టర్ అధికారులపై దాడులు చేసింది బీఆర్ఎస్ పార్టీ వారేనని, కేసీఆర్ కొడుకు కేటీఆర్ ఉన్నాడని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఎందుకు అరెస్టు చేయలేదని" ప్రశ్నించారు. దాడి ఘటనపై కలెక్టర్ ప్రభుత్వానికి పూర్తి స్థాయి నివేదిక అందజేశారు. కానీ ప్రభుత్వం ఆ నివేదికను ఎందుకు బయట పెట్టడం లేదన్నారు. కేటీఆర్ ఢిల్లీ పోయి హైకమాండ్ ను కలిశారు అందుకే కేసు మాఫీ అయ్యిందన్నారు. లగచర్ల ఫార్మాసిటీ కి బీజేపీ వ్యతిరేకం కాదు. రైతులకు అన్యాయం జరుగకుండా రైతులను ఒప్పించి, రైతులకు న్యాయం చేసి ఫార్మాసిటీ కట్టుకోండన్నారు. రైతులకు న్యాయం చేయకుండా దౌర్జన్యంగా కడుతామంటే ఇది రాజరిక పాలన అని ప్రశ్నించారు. "కలెక్టర్ మీద దాడి చేయడం తప్పు, బీఆర్ఎస్ వాళ్లు దాడి చేసిందని ప్రభుత్వం చెప్పింది. ఇందులో కేసీఆర్ కొడుకున్నడని ప్రభుత్వం చెప్పింది. ఈ దాడిలో కుట్ర జరిగిందని కలెక్టర్ రిపోర్టు ఇచ్చారు. ఈ రిపోర్ట్ ను బయట పెట్టడం లేదంటే ప్రభుత్వం చేతగాని తనం” అన్నారు. కేటీఆర్ కుటుంబానికి రేవంత్ కుటుంబానికి వ్యాపార పరంగా సంబంధాలు ఉన్నాయి నేను వాటిని నిరూపిస్తా నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా" అంటూ కేటీఆర్ కు బండి సంజయ్ సవాల్ విసిరారు.ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, రాజేశ్వర్ రావు దేశ్ పాండే తదితరులు పాల్గొన్నారు.



Similar News