మైనర్ పిల్లలకు వాహనాలిచ్చి ప్రోత్సహిస్తే తల్లిదండ్రులు సైతం జైలు ఊచలు లెక్కబెట్టాల్సిందే: Telangana Police

ప్రస్తుత రోజుల్లో పదేళ్ల పిల్లలు కూడా వాహనాలు నడుపుతున్నారు.

Update: 2024-09-03 03:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో పదేళ్ల పిల్లలు కూడా వాహనాలు నడుపుతున్నారు. అంతేకాకండా పలు స్టంట్లు చేస్తూ రోడ్ల మీద ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. తోటి వాహనాదారులకు ఇబ్బంది కలుగుతుందని ఏం ఆలోచించకుండా యమ స్పీడ్‌తో దూసుకెళ్తుండటంతో బైక్ నడిపే వ్యక్తితో పాటు తోటి వాహనాదుడు కూడా ప్రమాదంలో పడుతున్నాడు. ఒక్కరి తప్పిదం వల్ల కొన్నిసార్లు ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారు. దీంతో మైనర్లపై రోజుకు సగటున పది కేసుల వరకు నమోదు అవుతున్నాయని తెలంగాణ పోలీసు వెల్లడించింది.

అయితే పిల్లలు ముచ్చట పడుతున్నారని.. అంతేకాకుండా తమ హోదా చూపించుకోవడానికో కొంతమంది పిల్లల తల్లిదండ్రులు ఖరీదైన వాహనాలు కొనిస్తుంటారు. కాగా చిన్న చిన్న సరదాలే మీ కుటుంబం పాలిట శాపంగా మారుతుందని తెలంగాణ పోలీసు తెలిపింది. మైనర్ పిల్లలకు వాహనాలిచ్చి ప్రోత్సహస్తే తద్వారా జరిగే ప్రమాదాలతో తల్లిదండ్రులు సైతం జైలు ఊచలు లెక్కబెట్టాల్సిందేనని అంటున్నారు. మైనర్ పిల్లలు వాహనాలు నడిపితే మీ కుటుంబమే కాదు ఎదుటివారి కుటుంబాలు ప్రమాదంలో పడతాయని గుర్తించండని తెలంగాణ పోలీసు హెచ్చరించింది. 


Similar News