ఆ పని చేసి ఉంటే కేసీఆరే శాశ్వత ముఖ్యమంత్రి!.. సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు
ఉద్యమకారుల కష్టాన్ని గుర్తించి ఉంటే తెలంగాణకు కేసీఆరే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండేవారని, తెలంగాణ ప్రజలను అవమానిచండం వల్లే గత ఎన్నికల్లో ఓడిపోయారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: ఉద్యమకారుల కష్టాన్ని గుర్తించి ఉంటే తెలంగాణకు కేసీఆరే శాశ్వత ముఖ్యమంత్రిగా ఉండేవారని, తెలంగాణ ప్రజలను అవమానిచండం వల్లే గత ఎన్నికల్లో ఓడిపోయారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సీపీఐ ఆఫీస్ లో జెండా ఎగరేసిన ఆయన కేసీఆర్ పై పలు విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఎంతో మంది ఉద్యమకారులు, విద్యార్ధులు అశువులు బాషారని, దాదాపు 1500 మంది విద్యార్ధులు ఆత్మబలిదానం చేసుకున్నారని, ఉద్యమాల్లో పాల్గొని, ఆందోళన సాగించి మాపాలన, మా నీళ్లు మా నిధులు మాకు కావాలనే నినాదాన్ని తీసుకొచ్చారన్నారు. ఉద్యమం వేదికగా రాజకీయ పార్టీ పెట్టుకుంది కేసీఆర్ అని, దాని చుట్టూ అందరం తిరిగి తెలంగాణ సాధించుకుంటే ఆ క్రెడిట్ ఆయనకు దక్కి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు.
అంత కష్టపడి సాధించుకున్న రాష్టా్న్ని కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని, ఏ లక్ష్యంతో తెలంగాణ వచ్చిందో దాన్ని గుర్తుపెట్టుకొని పాలించి ఉంటే కేసీఆరే శాశ్వత సీఎంగా ఉండేవారని తెలిపారు. ఓడలో ఉన్నప్పుడు ఓడ మల్లన్న ఓడ దిగాక బోడి మల్లన్న అన్నట్లు తెలంగాణ ప్రజలను అవమానించాడన్నారు. 17 మంది క్యాబినెట్ లో ఉంటే.. అందులో 12 మంది తెలంగాణను వ్యతిరేకించిన వాళ్లనే పెట్టుకుని అహంబావం ప్రదర్శించాడని విమర్శలు చేశాడు. ఇక కేసీఆర్ అవినీతి గురించి చెప్పక్కర్లేదని, అవినీతి, అహంబావం ఉంటే ఎక్కువ కాలం రాజకీయాల్లో ఉండలేరని, అందుకే ప్రజలు పదేళ్లకే పంపించేశారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి యువకుడు గత పాలనను దృష్టిలో పెట్టుకొని, ప్రజావ్యతిరేఖ పాలనకు దూరంగా అందర్ని కలుపుకొని ముందుకుపోవాలని, ప్రథమ ప్రాధాన్యత రాష్ట్ర అభివృద్దికి ఇచ్చి తర్వాత చిన్న చిన్న పనులు చేసుకుంటూ పోవాలని నారాయణ సూచించారు.