Bandi Sanjay : గ్యారంటీలను విస్మరిస్తే ప్రజలే గుణపాఠం చెబుతారు : కేంద్ర మంత్రి బండి సంజయ్
కాంగ్రెస్(Congress Govt) ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఎక్కడా అమలు చేయలేదని, హామీలను విస్మరిస్తే ప్రజలే ఆ పార్టీకి గుణపాఠం చెబుతారని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్(Minister Bandi Sanjay) ఎక్స్ వేదికగా హెచ్చరించారు
దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్(Congress Govt) ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఎక్కడా అమలు చేయలేదని, హామీలను విస్మరిస్తే ప్రజలే ఆ పార్టీకి గుణపాఠం చెబుతారని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్(Minister Bandi Sanjay) ఎక్స్ వేదికగా హెచ్చరించారు. దేశంలోని పలు రాష్ట్రాల ఎన్నికల్లో గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసగిస్తుందని, 6 గ్యారంటీలు ఏడా అమలు జెయ్యలేదని విమర్శించారు. కర్ణాటకలో 6 అన్నరు.. చేతులెత్తిసిండ్రని, తెలంగాణలో మళ్లీ 6 అన్నరు.. దుకాణం బంద్ చేసిండ్రని, మహారాష్ట్రలో 6 అనగానే... గీళ్ల దుకాణమే బంద్ చేసి బుద్దిచెప్పిండ్రని...
ఖబర్ధార్ కాంగ్రెస్..6 గ్యారంటీలు అమలు చేయకుంటే.. ప్రజలే మీకు ఘోరీ కడుతారని బండి సంజయ్ హెచ్చరించారు. తెలంగాణలో మారింది పాలకులేనని, పాలన కాదని, మార్పురాలే ప్రజల బతుకులు మారలేదని కాంగ్రెస్ పాలనప విమర్శలు గుప్పించారు. బీఆరెఎస్ పాలనలో కాళేశ్వరంతో లక్ష కోట్ల దోపిడీ, కాంగ్రెస్ పాలనలో మూసీ పేరుతో లక్షన్నర కోట్లకు ఎసరు అని, అప్పుడు 12మంది ఎమ్మెల్యేలను గుంజుకున్నారని, ఇప్పుడు 10మంది ఎమ్మెల్యేలను కొన్నారని విమర్శించారు. ధనిక రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పాలకులు 80వేల కోట్ల అప్పులు చేస్తే కాంగ్రెసోళ్లు కూడా అదే చేస్తున్నారన్నారు. అప్పుడు పదేళ్ల పాటు కే ట్యాక్స్ అని, ఇప్పుడు అన్నింటా అర్ఆర్ ట్యాక్స్ అని ఆరోపించారు. నాడు ధరణితో 10లక్షల ఎకరాల భూములు మయాం చేస్తే, నేడు హైడ్రా, ఫోర్త్ సిటీ పేరుతో లక్షల ఇండ్లను కూల్చుతున్నారన్నారు. ఆడబిడ్డలకు జీరో వడ్డీ అని బీఆర్ఎస్ వాళ్లు మోసం చేస్తే, స్కూటీ, తులం బంగారం పేరుతో కాంగ్రెసోళ్లు మోసం చేశారని బండి సంజయ్ విమర్శించారు.