Sweta Mohanty IAS : కేంద్ర సర్వీస్‌లోకి ఐఏఎస్ శ్వేతా మహంతి
తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారిణి శ్వేతా మహంతి కేంద్ర సర్వీసులకు వెళ్లనున్నారు. నాలుగేళ్ల పాటు కేంద్ర సర్వీసుల్లో పని చేసేందుకు అనుమతి ఇస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారిణి శ్వేతా మహంతి కేంద్ర సర్వీసులకు వెళ్లనున్నారు. నాలుగేళ్ల పాటు కేంద్ర సర్వీసుల్లో పని చేసేందుకు అనుమతి ఇస్తూ కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలోని క్యాబినెట్ సెక్రటేరియట్లో డిప్యూటీ సెక్రటరీగా ఆమెను నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2011 కేడర్‌కు చెందిన శ్వేతా మహంతి ప్రస్తుతం తెలంగాణ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. అంతకు ముందు హైదరాబాద్, వనపర్తి జిల్లాలకు కలెక్టర్‌గా వ్యవహరించారు. ఇంజనీరింగ్ విద్యను అభ్యసించిన శ్వేతా మహంతి.. ఆ తర్వాత సివిల్స్ వైపు అడుగులు వేశారు. రెండో ప్రయత్నంలోనే ఏకంగా ఆల్ ఇండియా రెండో ర్యాంకు సాధించి కలెక్టర్ అయ్యారు.