Harish Rao : మూసీ సమస్యలపై పాదయాత్రకు నేను సిద్ధమే : హరీష్ రావు

సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సవాల్ ను స్వీకరిస్తున్నట్టు బీఆర్ఎస్(BRS) నేత హరీష్ రావు(Harish Rao) ప్రకటించారు.

Update: 2024-11-09 10:47 GMT

దిశ, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సవాల్ ను స్వీకరిస్తున్నట్టు బీఆర్ఎస్(BRS) నేత హరీష్ రావు(Harish Rao) ప్రకటించారు. మూసీ(Musi) సమస్యలపై వచ్చే జనవరిలో వాడపల్లి నుంచి పాదయాత్ర చేస్తానని.. దమ్ముంటే మీరు కూడా తనతోపాటు పాదయాత్ర చేయాలని శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరిన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన హరీష్ రావు సీఎం విసిరిన సవాల్ స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. శనివారం మెదక్ జిల్లా కొల్చారంలో జరిగిన రైతు గర్జన సభకు హరీష్ రావు హాజరయ్యారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ.. మూసీ సమస్యలపై పాదయాత్రకు తాను సిద్దమేనని... హైదరాబాద్, నల్గొండలో ఎక్కడైనా పాదయాత్రకు రెడీగా ఉన్నానని.. డేట్, టైమ్ చెప్పాలంటూ ప్రతి సవాల్ విసిరారు. హామీ ఇవ్వకపోయినా కేసీఆర్(KCR) సీఎంగా ఉన్నప్పుడు రైతుబంధు, రైతుబీమా వంటి అనేక పథకాలు అమలు చేశారని.. అందుకే ఆయన రైతుల సీఎం అయ్యారని తెలియజేశారు. రేవంత్ రెడ్డి రైతులకు, ప్రజలకు ఏమీ చేయకుండా బూతుల సీఎంగా ఉన్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఆరు గ్యారంటీలు అమలయ్యాయని రేవంత్ రెడ్డి మహారాష్ట్రలో అబద్దాలు చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు ఋణమాఫీ అంటూ ప్రజలను మోసం చేశారని.. దేవుళ్ళపై ఒట్టు పెట్టి మరీ మాట తప్పారని అన్నారు. మూసీ మురికిగా మారడానికి కారణం టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలే అనే విషయం రేవంత్ మర్చిపోయి.. తిట్ల దండకానికి దిగారని .. వాటికి భయపడేవాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరని హరీష్ రావు పేర్కొన్నారు.   

Tags:    

Similar News