Hydra: హైడ్రాకు మద్దత్తు కండీషనలే... ఓ నెటిజన్ పోస్ట్‌కు ఘంటా చక్రపాణి రిప్లై

హైడ్రాకు కండీషనల్ గానే మద్దత్తు ఉంటుందని, సంపన్నుల ఆక్రమణలు కూల్చినప్పుడు చప్పట్లు కొట్టిన వాళ్లే, సామాన్యుల జోలికి వెళితే తిరగబడతారని టీజీపీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొ. ఘంటా చక్రపాణి అన్నారు.

Update: 2024-09-28 06:15 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: హైడ్రాకు కండీషనల్ గానే మద్దత్తు ఉంటుందని, సంపన్నుల ఆక్రమణలు కూల్చినప్పుడు చప్పట్లు కొట్టిన వాళ్లే, సామాన్యుల జోలికి వెళితే తిరగబడతారని టీజీపీఎస్సీ మాజీ చైర్మన్ ప్రొ. ఘంటా చక్రపాణి అన్నారు. ఓ ఇంటర్వ్యూలో ఘంటా చక్రపాణి హైడ్రాపై చేసిన వ్యాఖ్యలను పోస్ట్ చేస్తూ.. "రేవంతన్నపై ప్రశంసల జల్లు.. హైడ్రాకు భారీగా పెరుగుతున్న మద్దత్తు" అని ఓ కాంగ్రెస్ సపోర్టర్ ట్వీట్ చేశారు. దీనికి ఆయన రిప్లై ఇస్తూ.. హైడ్రా మద్దత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఘంటా చక్రపాణి.. మద్దతు అన్‌కండిషనల్ కాదని, హైడ్రా అవగాహనతో ఉండాలి! కానీ మెదడు, మనసు లేని బుల్డోజర్ల మూర్ఖత్బంతో కాదని వ్యాఖ్యానించారు.

అలాగే మానవత్వంతో.. బెదిరించి కాదు, అవగాహనతో వ్యవహరించాలని ఇంటర్వ్యూలో చెప్పినట్లు పేర్కొన్నారు. అంతేగాక ముందు ఎఫ్టీఎల్, బఫర్లు నోటిఫై చేసి.. తరువాత నోటీసులు ఇవ్వాలని సూచించారు. అలాగే పునరావాస విధానం ప్రకటించి.. పేదలకు ప్రత్యామ్నాయం చూపాలన్నారు. ఇక అనుమతులు ఉన్న చోట పరిహారం చెల్లించి.. అక్రమంగా అనుమతులు ఇచ్చిన అధికారులను శిక్షించాలని సలహా ఇచ్చారు. అదేవిధంగా ఇంకోమాట కూడా ఇదే ఇంటర్వ్యూ లో చెప్పానని, సంపన్నుల ఆక్రమణలను కూల్చినప్పుడు చప్పట్లు కొట్టిన వాళ్లే, సామాన్యుల జోలికి వెళితే తిరగబడతారని గుర్తుంచుకోవాలన్నారు. ప్రజలను వేధిస్తే పూర్తిగా నష్ట పోతారు.. మునిగి పోతారని, ఇది కూడా గమనించాలని ఘంటా చెప్పారు. 


Similar News