Hydra: హైడ్రా అంటే ఆక్రమణలను కూల్చడం ఒక్కటే కాదు

హైడ్రా(Hydra) ఆక్రమణలను తేల్చడు.. కూల్చుడే కాదు. చెరువుల సుందరీకరణతో విపత్తుల నిర్వహణ, ట్రాఫిక్ నిర్వహణలో సహకారం వంటి కార్యక్రమాలకు హైడ్రా శ్రీకారం చుట్టింది.

Update: 2024-10-29 14:43 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హైడ్రా(Hydra) ఆక్రమణలను తేల్చడు.. కూల్చుడే కాదు. చెరువుల సుందరీకరణతో విపత్తుల నిర్వహణ, ట్రాఫిక్ నిర్వహణలో సహకారం వంటి కార్యక్రమాలకు హైడ్రా శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే ట్రాఫిక్ పోలీసులకు సహకారంగా హైడ్రా వాలంటీర్లు పనిచేయనున్నారు. అందుకు హైడ్రా డీఆర్ఎఫ్(DRF) సిబ్బంది సిద్ధమవుతున్నారు. మొదటి దశలో పైలెట్‌గా 50 మంది వాలంటీర్లకు గోషామ‌హ‌ల్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో మంగళవారం శిక్షణ ఇచ్చారు. ట్రాఫిక్ క్రమ‌బ‌ద్ధీక‌ర‌ణ మెలుకువ‌ల గురించి ట్రైనింగ్ ఇచ్చారు. హైడ్రా ట్రాఫిక్ వాలంటీర్‌లు పేరిట ముఖ్యమైన కూడ‌ళ్లు, ట్రాఫిక్ ర‌ద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసుల‌కు తోడుగా సేవ‌లందించనున్నట్టు హైడ్రా కమిషనర్ ఏవీ.రంగనాథ్(Hydra Commissioner AV Ranganath) ప్రకటించిన విషయం తెలిసిందే.

ట్రాఫిక్ ర‌ద్దీ, ఇత‌ర ముఖ్యమైన స‌మ‌యాల్లో పోలీసుల‌కు స‌హ‌క‌రించే విధంగా హైడ్రా ట్రాఫిక్ వాలంటీర్ల సేవ‌లుంటాయ‌ని రంగనాథ్ వివ‌రించారు. హైడ్రా ట్రాఫిక్ వాలంటీర్ పేరిట రేడియం జాకెట్లు వేసుకుని సేవ‌ల‌కు సిద్ధమవుతున్నారు. వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు.. ఇలా ప్రకృతి వైప‌రీత్యాలు లేని స‌మ‌యంలో ట్రాఫిక్ పోలీసులకు స‌హ‌క‌రించే విధంగా హైడ్రా నిర్ణ‌యం తీసుకున్నది. త్వ‌ర‌లో ముఖ్య‌మైన కూడ‌ళ్ల‌లోనూ హైడ్రా ట్రాఫిక్ వాలంటీర్లు విధులు నిర్వ‌హించ‌నున్నారు.

Tags:    

Similar News