HYDRA: చెరువు తూములు మూసి అపార్ట్‌మెంట్లు కట్టారు: హైడ్రా కమిషనర్ రంగనాథ్

నగర వ్యాప్తంగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణలపై ‘హైడ్రా’ కొరడా ఝుళిపిస్తోంది.

Update: 2024-08-31 08:43 GMT

దిశ, వెబ్‌డెస్క్: నగర వ్యాప్తంగా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణలపై ‘హైడ్రా’ కొరడా ఝుళిపిస్తోంది. వరుసగా కూల్చివేతలు చేపడుతూ.. నిర్భయంగా తనపని తాను చేసుకుపోతోంది. ఈ క్రమంలోనే శనివారం ఉదయం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పటాన్‌చెరు ప్రాంతంలో పర్యటించారు. స్థానికంగా ఉన్న సాకి చెరువును ఆయన జీహెచ్ఎంసీ అధికారులతో పరిశీలించారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను గుర్తించిన ఆధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాకి చెరువులో ఎఫ్టీఎల్ పరిధిలో మొత్తం 18 అక్రమ నిర్మాణాలను గుర్తించామని తెలిపారు. ఇన్‌కోర్ సంస్థ ఏకంగా చెరువు తూమును పూర్తిగా పూడ్చి అపార్టుమెంట్‌ కట్టినట్లుగా ఫిర్యాదులు అందాయని పేర్కొన్నారు.

జగన్‌కు నోటీసులపై క్లారిటీ ఇచ్చిన రంగనాథ్

మాజీ సీఎం జగన్‌కు హైడ్రా నోటీసులు ఇచ్చిందనే ప్రచారంపై హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ క్లారిటీ ఇచ్చారు. సోషల్‌మీడియాలో వస్తున్న అలాంటి వార్తలు పూర్తిగా అవాస్తవాలని కొట్టి పడేశారు. ఎవరో కావాలనే తమపై దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. జగన్‌కి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని వెల్లడించారు.  


Similar News