TELANGANA: హైడ్రా ఎఫెక్ట్.. భారీగా తగ్గిన రిజిస్ట్రేషన్లు!

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా పలువురి రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీల గుండెల్లో దడ పుట్టిస్తోంది.

Update: 2024-09-03 06:29 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా పలువురి రాజకీయ నాయకులు, సినీ సెలబ్రిటీల గుండెల్లో దడ పుట్టిస్తోంది. హైడ్రాతో జనంలో భయాందోళనలు మొదలయ్యాయి. ఇటీవలే నాగార్జున ఎన్ కన్వెన్షన్ ను అక్రమ కట్టడంగా చూపించి కూల్చివేసిన విషయం తెలిసిందే. హైదరాబాదులో కూడా చెరువులు ఆక్రమణలు, ఎఫ్డీఎల్ , బఫర్ జోన్ ల పరిధిలో అక్రమంగా నిర్మించిన వాటిని ఎక్కడికక్కడా కూల్చేశాయి. ప్రభుత్వ భూముల్లో కట్టిన ఏ ఇళ్లును కూడా వదలట్లేదు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని భారీ వర్షాల కారణంగా హైడ్రా కూల్చివేతలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. అయితే హైడ్రా కూల్చివేతల ప్రభావం రిజిస్ట్రేషన్ల శాఖపై చూపిస్తున్నట్లు తెలుస్తోంది. గత నెలతో పోలిస్తే రూ.320 కోట్ల మేర ఆదాయం తగ్గిపోయింది. జూలై నెలతో పోలిస్తే రిజిస్ట్రేషన్లు భారీగా తగ్గిపోయాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ - మల్కాజ్గిరి, సంగారెడ్డిలో 58,000 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. ఆగస్టులో 41,200 రిజిస్ట్రేషన్లు అయ్యాయి. జూలైలో రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చిన ఆదాయం రూ.1105 కోట్ల ఆదాయం రాగా.. ఆగస్టులో రూ.320 కోట్ల మేర ఆదాయం తగ్గి రూ.785 కోట్లకి పడిపోయింది.


Similar News