వారం క్రితం ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన యువకుడు.. చివరికి ఏమయ్యాడు..

బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు అదృశ్యం అయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Update: 2023-06-26 15:34 GMT

దిశ, జూబ్లిహిల్స్ : బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో యువకుడు అదృశ్యం అయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బోరబండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బోరబండ, శ్రీరామ్ నగర్ కి చెందిన షేక్ ఇమ్రాన్ (27) వారం రోజుల క్రితం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్లిపోయాడు. ఇతనికి మద్యం అలవాటు ఉండడంతో అప్రమత్తమయిప కుటుంబ సభ్యులు వారి బంధువులని, ఇమ్రాన్ స్నేహితులను సంప్రదించారు. ఆచూకీ తెలియకపోవడంతో బోరబండ పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించాయి. ఇమ్రాన్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇతని ఆచూకీ తెలిస్తే 8712665189 నంబర్ కు సమాచారం అందించాలని తెలిపారు.

Tags:    

Similar News