ఆ కాంట్రాక్టర్‌పై అంత ప్రేమేందుకో?
ఉజ్జయిని మహంకాళి అధికారులకు ఆ కాంట్రాక్టర్ అంటే అమితమైన అభిమానం . టెండర్ నిబంధనలు ఉల్లంఘించిన పట్టించుకోరు.
దిశ , బేగంపేట: ఉజ్జయిని మహంకాళి అధికారులకు ఆ కాంట్రాక్టర్ అంటే అమితమైన అభిమానం . టెండర్ నిబంధనలు ఉల్లంఘించిన పట్టించుకోరు. చెక్కులు బౌన్స్ అయినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. డబ్బు చెల్లించకున్నా మిన్నకుండిపోయారు. ఇప్పుడు ఏకంగా టెండర్ గడువు ముగిసిపోయినా ఇంకా దేవాలయ ప్రాంగణంలో చీరెల విక్రయాలకు చేస్తున్నా ఆడ్డుచెప్పడం లేదు . అమ్మవారి ఆదాయానికి గండి కొడుతున్న ఎందుకో మరి ఆ కాంట్రాక్టర్ అంటే మహంకాళి దేవాలయ అధికారులు అమితమైన ప్రేమను చూపిస్తున్నారు.
గడువు ముగిసినా చీరెల విక్రయాలు
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి భక్తులు సమర్పించే చీరెలను కొనుగోలు చేసేందుకు ప్రతి ఏడాది అధికారులు టెండర్ పిలుస్తారు . టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టరుకు భక్తులు సమర్పించిన చీరెలను ఇస్తారు . ఆయన దేవాలయం వద్ద కౌంటర్ ఏర్పాటు చేసుకుని వస్తే భక్తులకు వాటిని విక్రయించుకునేందుకు అనుమతిస్తారు. గత ఏడాది కూడా ఓ కాంట్రాక్టర్ రూ .26 లక్షలకు ఈ టెండర్ దక్కించుకున్నారు . అయితే మార్చి 31 వ తేదీతో అతని గడువు ముగిసిపోయింది . కానీ ఇంకా దేవాలయం వద్ద అధికారుల అనధికారిక అనుమతితో కౌంటర్ కొనసాగిస్తూ చీరెలు విక్రయిస్తున్నారు .
టెండర్ నిబంధనలు ఉల్లంఘన
గత ఏడాది నిర్వహించిన టెండర్లలో ఇదే కాంట్రాక్టర్ అన్ని నిబంధనలు ఉల్లంఘించినా అతనికే కాంట్రాక్టును అధికారులు కట్టబెట్టారు. టెండర్లలో పాల్గొనే వ్యక్తి ఈ ఎండి రూ .2.5 లక్షల డీడీని అందించాలి . కానీ డిడి ఇవ్వకుండా ఈయన చెక్కు ఇచ్చినా టెండర్ ను ఆమోదించారు. కానీ ఇచ్చిన చెక్కు బ్యాంకులో జమ చేస్తే అది బౌన్స్ అయింది . ఇక టెండర్ దక్కించుకున్న 2 రోజుల్లో సగం డబ్బు చెల్లించాలి అంటే రూ 13 లక్షలు చెల్లించాలి, 3 నెలల్లో మిగతా మొత్తం డబ్బు చెల్లించాలి . కానీ సదరు కాంట్రాక్టర్ మాత్రం అధికారుల సహకారంతో టెండర్ గడువు ముగిసే వరకు కొంత కొంత చెల్లిస్తూ వచ్చాడు. ఇలా అన్ని నిబంధనలు ఉల్లంఘించినా ఇతనికే టెండర్ కట్టబెట్టడం , గడువు పూర్తయిన ఇంకా చీరెలు విక్రయించేందుకు అనుమతించడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తొలగిస్తాం: ఈవో మనోహర్ రెడ్డి
చీరేలా గడువు ముగిసిపోయింది వాస్తవమే. కొన్ని చీరెలు మిగిలిపోయాయని ఆయన కోరడంతో అక్కడే పెట్టుకోమని చెప్పాం. వెంటనే తొలగిస్తామని ఈవో తెలిపారు.