వాహనదారులకు బిగ్ అలర్ట్.. రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..!

హైదరాబాద్ నగరంలో రేపు పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. బతుకమ్మ సంబురాలు ముగింపు దశకు చేరుకున్నాయి. అదివారం చివరిరోజైన సద్దుల బతుకమ్మను ట్యాంక్

Update: 2023-10-21 08:43 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నగరంలో రేపు పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. బతుకమ్మ సంబురాలు ముగింపు దశకు చేరుకున్నాయి. అదివారం చివరిరోజైన సద్దుల బతుకమ్మను ట్యాంక్ బండ్‌పై నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలు రూట్లలో వాహనాలను మళ్ళించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు లుంబినీ పార్కు, ట్యాంక్‌బండ్ చుట్టూ వాహనాలకు అనుమతి లేదు.

వాహనాదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని అధికారులు సూచించారు. సికింద్రాబాద్ వెళ్లే వారు తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై నుంచి వెళ్లాలి. పంజాగుట్ట, రాజ్‌భవన్‌ రోడ్డులో నుంచి ఖైరతాబాద్ ఫ్లై ఓవ‌ర్‌ మీదుగా వచ్చే వాహనాలను నెక్లెస్‌ రోడ్ ఇందిరాగాంధీ విగ్రహాం వద్ద ఐమాక్స్‌ రూట్‌లోకి మళ్లిస్తారు. ముషీరాబాద్‌ నుంచి ట్యాంక్‌బండ్‌ వైపు వచ్చే వాహనాలను కవాడిగూడ క్రాస్‌రోడ్డు వద్ద మళ్లిస్తారు.

Tags:    

Similar News