హనుమాన్ విజయ యాత్ర.. రేపు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు
శ్రీ హనుమాన్విజయ యాత్రను పురస్కరించుకుని నగరంలోని పలు చోట్ల ట్రాఫిక్ఆంక్షలు విధించినట్టు హైదరాబాద్పోలీస్కమిషనర్సీ.వీ.ఆనంద్తెలిపారు. ట్రాఫిక్సమస్యలు ఉత్పన్నం
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో : శ్రీ హనుమాన్విజయ యాత్రను పురస్కరించుకుని నగరంలోని పలు చోట్ల ట్రాఫిక్ఆంక్షలు విధించినట్టు హైదరాబాద్పోలీస్కమిషనర్సీ.వీ.ఆనంద్తెలిపారు. ట్రాఫిక్సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడటానికి విధించిన ఈ ఆంక్షలకు అందరూ సహకరించాలని కోరారు. నేటి ఉదయం 11.30గంటలకు గౌలిగూడ రాంమందిర్నుంచి శ్రీ హనుమాన్విజయ యాత్ర ప్రారంభమై పుత్లీబౌలి చౌరస్తా, కోఠి ఆంధ్రా బ్యాంక్చౌరస్తా, డీఎం అండ్హెచ్చెస్ సుల్తాన్బజార్చౌరస్తా, రాంకోఠి చౌరస్తా, కాచిగూడ చౌరస్తా మీదుగా కొనసాగుతుంది. కాచిగూడ చౌరస్తా నుంచి నారాయణగూడ వైఎంసీఏ, చిక్కడపల్లి చౌరస్తా, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, అశోక్‌నగర్, గాంధీనగర్, వైస్రాయ్హోటల్వెనక వైపు నుంచి ప్రాగాటూల్, కవాడీగూడ, సీజీవో టవర్స్, బన్సీలాల్‌పేట రోడ్డు, బైబిల్‌హౌస్, సిటీలైట్‌హోటల్, బాటా షోరూం, ఉజ్జయినీ మహంకాళి ఆలయం, ఓల్డ్రాంగోపాల్పేట పోలీస్స్టేషన్మీదుగా ప్యారడైజ్చౌరస్తాకు యాత్ర చేరుకుంటుంది. అక్కడి నుంచి సీటీవో జంక్షన్, లీ రాయల్‌ప్యాలెస్, బ్రూక్‌బాండ్, ఇంపీరియల్గార్డెన్, మస్తాన్కేఫ్ వద్దకు చేరుకుని ఎడమ వైపు తిరిగి తాడ్ బన్హనుమాన్ఆలయానికి రాత్రి 8గంటల సమయానికి చేరుకుంటుంది.
కర్మన్ఘాట్నుంచి..
ఇక, కర్మన్ఘాట్ఆంజనేయ స్వామి ఆలయం నుంచి మరో శ్రీ హనుమాన్విజయ యాత్ర జరుగుతుంది. ఈ ఊరేగింపు చంపాపేట ప్రాంతం నుంచి హైదరాబాద్కమిషనరేట్పరిధిలోకి ప్రవేశిస్తుంది. చంపాపేట్చౌరస్తా నుంచి ఐఎస్‌సదన్, దోభీఘాట్, మలక్‌పేట ఏసీపీ ఆఫీస్, సైదాబాద్, శంకేశ్వర్‌బజార్ మీదుగా సరూర్నగర్చేరుకుని రాచకొండ పోలీస్కమిషనరేట్లోకి ప్రవేశిస్తుంది. ఆ తరువాత తిరిగి హైదరాబాద్కమిషనరేట్పరిధిలోకి ప్రవేశించి దిల్సుక్నగర్రాజీవ్గాంధీ విగ్రహం, మూసారాంబాగ్జంక్షన్, మలక్‌పేట, నల్గొండ చౌరస్తా, ఆజంపురా, చాదర్ఘాట్చౌరస్తా మీదుగా వచ్చి ఉమెన్స్‌కాలేజీ జంక్షన్ వద్ద ప్రధాన ఊరేగింపులో కలుస్తుంది.
ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు..
లక్డీకాపూల్నుంచి దిల్సుక్నగర్వైపు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల మధ్య వచ్చేవారు బషీర్‌బాగ్, ఓల్డ్ఎమ్మెల్యే క్వార్టర్స్, హిమాయత్నగర్వై జంక్షన్, నారాయణగూడ ఫ్లైఓవర్, బర్కత్‌పురా, ఫీవర్‌హాస్పిటల్ వద్దకు చేరుకుని కుడివైపు తిరిగి తిలక్‌నగర్, అంబర్‌పేట ఛే నెంబర్చౌరస్తా, అలీకేఫ్చౌరస్తా, మూసారాంబాగ్మీదుగా దిల్సుక్నగర్చేరుకోవాలని కమిషనర్ఆనంద్సూచించారు. దిల్సుక్నగర్నుంచి మెహదీపట్నం వెళ్లాలనుకునే వారు ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట రోడ్డు మీదుగా ఆరాంఘర్, అత్తాపూర్నుంచి ప్రయాణం చేయాలన్నారు. మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 7గంటల మధ్య లక్డీకాపూల్నుంచి సికింద్రాబాద్, ఉప్పల్వైపు వెళ్లాలనుకునే వారు విశ్వేశ్వరయ్య విగ్రహం, సోమాజీగూడ, గ్రీన్‌ల్యాండ్స్, బేగంపేట ఫ్లైఓవర్, ప్రకాశ్‌నగర్ ఫ్లైఓవర్, ప్యారడైజ్ఫ్లై ఓవర్మీదుగా వచ్చి ఎడమవైపు తిరిగి జూబ్లీబస్టాండ్వద్దకు చేరుకోవాలని చెప్పారు. అక్కడి నుంచి సెయింట్జాన్రోటరీ మీదుగా ఉప్పల్వైపు వెళ్లాలని సూచించారు. ఆయా రోడ్లలో పరిస్థితి ఎలా ఉందన్న విషయాన్ని 040–2785 2482 నెంబర్‌కు ఫోన్‌చేసి తెలుసుకోవచ్చన్నారు. దీంతోపాటు 9010203626 నెంబర్‌పై హెల్ప్‌లైన్‌కు ఫోన్‌చేసి సమాచారం పొందవచ్చన్నారు. ఎక్కడైనా సమస్యలు ఉత్పన్నమైతే పోలీసుశాఖ సోషల్‌మీడియా యాప్‌ల ద్వారా తెలియచేయాలని సూచించారు.