దిశ తెలంగాణ క్రైం బ్యూరో : బీఆర్ అంబేద్కర్ జయంతి.. మహా విగ్రహ ఆవిష్కరణ నేపథ్యంలో సందర్భంగా శుక్రవారం మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 8గంటల వరకు ట్యాంక్ బండ్ పరిసరాల్లో నెక్లెస్‌రోడ్డు, ఐమాక్స్థియేటర్ఏరియాల్లో ట్రాఫిక్ఆంక్షలు ఉంటాయని సిటీ ట్రాఫిక్అడిషనల్ కమిషనర్సుధీర్బాబు తెలిపారు. అంబేద్కర్భారీ విగ్రహావిష్కరణ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం నేపథ్యంలో నిర్వహిస్తుండగా భారీగా జనాలు తరలిరానున్నారు. ఐమాక్స్ లో శాకుంతలం సినిమా ప్రీమియర్‌షోను కూడా రద్దు చేసినట్టు థియేటర్ వర్గాలు తెలిపాయి. మధ్యాహ్నం, సాయంత్రం షోలు కూడా ఉండవని.. రాత్రి10గంటల షో మాత్రం ఉంటుందని పేర్కొన్నాయి. ప్రీమియర్, మ్యాట్నీ, ఈవెనింగ్షో టిక్కెట్లు కొనుగోలు చేసిన వారికి డబ్బు వాపసు చేయనున్నట్టు తెలిపాయి.
ట్రాఫిక్ఆంక్షలు ఇలా..
విశ్వేశ్వరయ్య విగ్రహం - నెక్లెస్‌రోటరీ, ఎన్టీఆర్మార్గం, తెలుగుతల్లి జంక్షన్‌వద్ద ఇరువైపులా ట్రాఫిక్‌ను అనుమతించరు.
ఖైరతాబాద్, పంజాగుట్ట, సోమాజిగూడ నుంచి నెక్లెస్‌రోటరీ వైపు వచ్చే వెహికల్స్ ను విశ్వేశ్వరయ్య విగ్రహం నుంచి షాదన్కాలేజీ, నిరంకారీ భవన్‌వైపు..
ట్యాంక్బండ్నుంచి పీవీఎన్ఆర్మార్గం వైపు వచ్చే వాహనాలను సొనాబీ మసీదు నుంచి రాణిగంజ్, కర్బలా మైదాన్వైపు..
రసూల్‌పురా, మినిస్టర్రోడ్డు నుంచి నల్లగుట్ట మీదుగా నెక్లెస్‌రోటరీ వైపు వచ్చే వాహనాలను నల్లగుట్ట జంక్షన్‌నుంచి రాణిగంజ్‌వైపు..
ఇక్బాల్ మినార్ నుంచి జంక్షన్మీదుగా ట్యాంక్‌బండ్, రాణిగంజ్, లిబర్టీ వైపు వాహనాలు వెళ్లటానికి అనుమతించరు. వీటిని తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌బ్రిడ్జి మీదుగా కట్టమైసమ్మ ఆలయం, లోయర్ట్యాంక్బండ్వైపు మళ్లిస్తారు.
ట్యాంక్‌బండ్, తెలుగుతల్లి వైపు నుంచి ఎన్టీఆర్మార్గం వైపు వచ్చే వాహనాలను తెలుగుతల్లి జంక్షన్‌నుంచి ఇక్బాల్మినార్ జంక్షన్వైపు..
బీఆర్కేఆర్భవన్నుంచి ఎన్టీఆర్మార్గం వైపు వాహనాలను అనుమతించరు. తెలుగుతల్లి జంక్షన్‌నుంచి ఇక్బాల్మినార్జంక్షన్వైపు మళ్లిస్తారు. ఖైరతాబాద్బడా గణేశ్ నుంచి ప్రింటింగ్ప్రెస్జంక్షన్, నెక్లెస్‌రోటరీ వైపు అనుమతించరు. వీటిని రాజ్దూత్లైన్లోకి మళ్లిస్తారు. ఎన్టీఆర్గార్డెన్, ఎన్టీఆర్ఘాట్, నెక్లెస్‌రోడ్డు, లుంబినీ పార్కు మూసివేసి ఉంటాయి.
ఆర్టీసీ బస్సులు..
అఫ్జల్గంజ్నుంచి సికింద్రాబాద్‌వైపు వచ్చే బస్సులు తెలుగుతల్లి ఫ్లైఓవర్బ్రిడ్జి మీదుగా లోయర్‌ట్యాంక్‌బండ్, డీబీఆర్‌మిల్స్, కవాడిగూడ మీదుగా వెళ్లాలి. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విధించిన ట్రాఫిక్ ఆంక్షలకు వాహనదారులు సహకరించాలని ట్రాఫిక్అడిషనల్ కమిషనర్ కోరారు.