కారుణ్య నియామకాల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం: టీఎన్జీవో

దిశ, హైదరాబాద్ బ్యూరో: దీర్ఘ కాలికంగా పెండింగ్ లో ఉన్న జూనియర్ అసిస్టెంట్ కారుణ్య నియామకాల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి త్వరలో పరిష్కరించేలా చూస్తామని టీఎన్జీవో తెలిపింది.

Update: 2024-08-29 13:29 GMT

దిశ, హైదరాబాద్ బ్యూరో: దీర్ఘ కాలికంగా పెండింగ్ లో ఉన్న జూనియర్ అసిస్టెంట్ కారుణ్య నియామకాల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి త్వరలో పరిష్కరించేలా చూస్తామని టీఎన్జీవో తెలిపింది. వివిధ హోదాలలో పనిచేస్తూ చనిపోయిన కుటుంబ సభ్యులు గురువారం టీఎన్జీవో కార్యాలయంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ హుసేనీ, సహ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లను కలిసి తమ గోడును వెల్లబోసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కారుణ్య నియామకాల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి త్వరలో పరిష్కరిస్తామని చెప్పారు. ఎవరు కూడా అదైర్యపడవద్దని వారికి టీఎన్జీవో అండగా ఉంటుందన్నారు. అనంతరం బాధిత కుటుంబాలకు చెందిన నిరుద్యోగులు మాట్లాడుతూ తెలంగాణలోని జిల్లా పరిషత్ లలో కారుణ్య నియామకాల ద్వారా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం 2016 సంవత్సరం నుండి ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా తాము పీజీలు, డిగ్రీలు చదివినా ఉద్యోగాలు రాలేదని, ఎనిమిదేళ్లుగా కుటుంబానికి భారంగా బతుకులీడుస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బి భాగ్య, ఆర్ నాగమణి,ఎస్ భారత్, కే సంతోష్, ఎన్ రాహుల్, పీ విజయ రెడ్డి, ఎన్ శ్రీకృష్ణ, పి శ్రీ కుమార్, బి కిరణ్ కుమార్, మీరాజ్ హాయ్, రామకృష్ణ, బి రమేష్, ఎం సాయి కృష్ణ, ఆర్ శ్రీకాంత్, అజిత్ తదితరులు పాల్గొన్నారు.


Similar News