జింఖానా గ్రౌండ్ ఎదుట నేటి పరిస్థితి ఇదే..
గత రెండు రోజులుగా జింఖానా గ్రౌండ్ ఎదుట జరుగుతున్న అలజడుల నేపథ్యంలో అటు హెచ్సీఏ, ఇటు పోలీసులు అప్రమత్తం అయ్యారు.
దిశ, వెబ్‌డెస్క్ : గత రెండు రోజులుగా జింఖానా గ్రౌండ్ ఎదుట జరుగుతున్న అలజడుల నేపథ్యంలో అటు హెచ్సీఏ, ఇటు పోలీసులు అప్రమత్తం అయ్యారు. మూడో రోజు తేరుకున్న అధికారులు ఇవాళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. నిన్న 3 వేల టికెట్ల కోసం 30 వేల మంది రావడంతో తీవ్ర తొక్కిసలాట, లాఠీచార్జ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పోలీసులతోపాటు క్రికెట్ అభిమానులకు గాయాలు అయ్యాయి. కాగా, గురువారం ఆఫ్ లైన్‌లో ఎలాంటి టికెట్లు విక్రయించడం లేదని, ఆన్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేసిన వారు మాత్రమే స్టేడియం వద్దకు రావాలని హెచ్‌సీఏ తెలిసింది. ఇందుకు సంబంధించి స్టేడియం ఎదుట ఫ్లెక్సీలను సైతం ఏర్పాటు చేశారు. మరోవైపు నిన్నటిలాంటి ఘటన పునరావృత్తం కాకుండా జింఖానా గ్రౌండ్ చుట్టూ భారీగా పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు. స్టేడియం వైపు వెళ్లే వారికి తనిఖీ చేసి పంపిస్తున్నారు. టికెట్లు ఉన్న వారినే అటువైపుగా అనుమతి ఇస్తున్నారు. సిబ్బందిని సైతం తనిఖీ చేశాక లోపటికి ఎంట్రీ ఇస్తున్నారు.