రోకలిబండతో తల్లిని చంపిన కొడుకు..ఎందుకంటే..?

జులాయిగా తిరుగుతూ మద్యం మత్తులో తల్లిని కడతేర్చాడో కిరాతకుడు.

Update: 2024-11-15 16:27 GMT

దిశ, తాండూరు : జులాయిగా తిరుగుతూ మద్యం మత్తులో తల్లిని కడతేర్చాడో కిరాతకుడు. రోకలిబండతో కొట్టడంతో ఆ మాతృమూర్తి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. ఈ విషాద ఘటన యాలాల మండలం జేక్కేపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గురువారం రాత్రి అదే గ్రామానికి చెందిన బొల్లె వెంకటప్ప తండ్రి మల్లప్ప(40)మద్యం మత్తులో ఇంట్లో కన్నతల్లి బొల్లె చంద్రమ్మ వయస్సు (76)గొడవ పెట్టుకొని, రోకలిబండతో మోదీ కన్నతల్లిని చంపాడు. మృతురాలి చిన్న కూతురు తిప్పమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శంకర్ తెలిపారు. కన్న తల్లిని హత్య చేసిన కసాయి కొడుకు వెంకటప్పను కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు కోరుతున్నారు.


Similar News