‘ఎమర్జెన్సీ' సినిమాను దేశవ్యాప్తంగా నిషేదించాలి’

బాలీవుడ్ హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ నటించి,

Update: 2024-09-09 13:35 GMT

దిశ,హిమాయత్ నగర్ : బాలీవుడ్ హీరోయిన్, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ నటించి, దర్శకత్వం, సహా నిర్మాత 'ఎమర్జెన్సీ' చలన చిత్రంలో సిక్కుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నందున తక్షణమే ఆ సినిమాను విడుదల కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిషేదించాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం ఫ్రంట్ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫ్రంట్ చైర్మన్ సనా ఉల్లాఖాన్, ప్రతినిధులు ప్రొ.అన్వర్ ఖాన్, డా.సర్జన్ సింగ్ మాట్లాడుతూ ఎమర్జెన్సీ సినిమాలో అత్యంత అభ్యంతరకరమైన సన్నివేశాలతో, సిక్కుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందని, ఈ సినిమాను అన్ని రాష్ట్రాల్లో నిషేదించాలని, ఒకే వేళ సినిమాను ప్రదర్శించినట్లయితే ఒక సిక్కు, మైనార్టీ వర్గాల పట్ల శత్రుత్వం కలిగించే ప్రమాదం ఉందని, ఆ సామాజిక వర్గాల యువత తిరగబడితే అందుకు ప్రభుత్వాలే బాధ్యత వహించవలసి వస్తుందని హెచ్చరించారు.

నేటి సినిమాల్లో కొన్ని వర్గాలను కావాలని లక్ష్యంగా చేసుకుని నిర్మించడం జరుగుతుందని దీంతో యువత, విద్యార్థులు హత్యలకు పాల్పడుతూ హంతకులుగా మారి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలోని జన్నత్ గ్రామంలో శాంతి భద్రతలు క్షీణించి, ఒక వర్గం పై దాడులు జరగడం తో కోట్లాది రూపాయల ప్రభుత్వ ధ్వంసం అయినాయని, అమాయక ముస్లిం మహిళలు, పిల్లలు చనిపోవడం జరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఫ్రంట్ నాయకులు నర్సింగ్ రావు, ఎంఏ.అజీజ్, సలీం అలీ హిందీ, ఎస్ఎస్.తన్వీర్ పాల్గొన్నారు.


Similar News