న్యూ ఇయర్, సంక్రాంతికి కరోనా ఆంక్షల్లేవ్... క్లారిటీ ఇచ్చిన వైద్యశాఖ
న్యూ ఇయర్ఈవెంట్లను ఈసారి గ్రాండ్‌గా సెలబ్రేట్చేసుకునే వెసులుబాటు కలిగింది. దాదాపు రెండేళ్ల తర్వాత...Special News Over Corona Provisions on Dec 31
దిశ, తెలంగాణ బ్యూరో: న్యూ ఇయర్ఈవెంట్లను ఈసారి గ్రాండ్‌గా సెలబ్రేట్చేసుకునే వెసులుబాటు కలిగింది. దాదాపు రెండేళ్ల తర్వాత ఎలాంటి ఆంక్షలు లేకుండా కొత్త సంవత్సర వేడుకలు జరుగనుండడం గమనార్హం. హైదరాబాద్‌తోపాటు అన్ని జిల్లాల్లోనూ సెలబ్రేషన్లను భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఆర్గనైజర్లు ప్లాన్చేస్తున్నారు. హోటళ్లు, పబ్‌లు, బార్లు, రెస్టారెంట్లు, ఫాం హౌజ్‌లు, గేటెడ్‌కమ్యూనిటీ ఇళ్లు, రిసార్ట్‌లలో సెలబ్రేషన్స్‌కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. గ్రేటర్హైదరాబాద్పరిధిలో దాదాపు వెయ్యి బిగ్ ఈవెంట్లు, మరో రెండు వేల వరకు మీడియం, స్మాల్ఈవెంట్లను నిర్వహించాలని వివిధ సంస్థలు సిద్ధమయ్యాయి. సోషల్‌మీడియా, డిజిటల్ఫ్లాట్ఫామ్ల వేదికగా విస్తృతంగా ప్రచారం కూడా చేస్తున్నారు. కరోనా కేసుల తీవ్రత లేనందున ప్రభుత్వం కూడా కరోనా ఆంక్షలపై మౌనంగా ఉన్నది. దీంతో ఫెస్టివల్స్, పార్టీలు ప్రశాతంగా జరుపుకోవచ్చని ప్రజలకు ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చింది. పైగా డిసెంబరు 31న రాత్రి బార్లు, వైన్స్గడువు సమయాన్ని కూడా గంట అదనంగా పెంచారు. డీజే సౌండ్లకు మాత్రం ఆంక్షలంటూ పోలీస్‌శాఖ ప్రకటించినా...కరోనా రూల్స్‌పై సర్కార్ నోరు మెదపలేదు. కానీ ఈసారి కూడా న్యూ ఇయర్‌కి ఆంక్షలుంటాయని గత వారం రోజులుగా సోషల్‌మీడియాల్లో వస్తున్న వార్తలు అవాస్తవమని మాత్రం వైద్యశాఖ ఆఫీసర్లు క్లారిటీ ఇచ్చారు. ఇతర దేశాల్లో ప్రబలుతున్న వేరియంట్లను మనం గతంలోనే ఎదుర్కొన్నామని హెల్త్ డిపార్మెంట్ కూడా రెండు రోజుల క్రితం సర్కార్‌కు నివేదిక ఇచ్చిన విషయమూ విధితమే. ప్రజలు కూడా ఎలాంటి భయాందోళనలు లేకుండా కొత్త సంవత్సర వేడుకలను నిర్వహించుకోవచ్చని వైద్యశాఖ పేర్కొన్నది.
మాస్కులు, భౌతిక దూరాలూ లేవ్...
కొవిడ్ మన స్టేట్‌లోకి 2020లో ప్రవేశించింది. ఆ ఏడాది కొత్త సంవత్సర వేడుకలపై పూర్తిగా ఆంక్షలు పెట్టగా, ఆ తర్వాత రెండేళ్లు మాస్కు, భౌతిక దూరంతో సెలబ్రేషన్స్ జరిగాయి. కానీ ఈసారి అవేమీ లేకుండానే కొవిడ్‌కంటే ముందు తరహాలో కొత్త సంవత్సర వేడుకలు జరగనున్నాయి. దీంతో నగరవాసులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పట్నం నుంచి పల్లెల వరకు న్యూ ఇయర్సెలబ్రేషన్స్కు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
అనుభవంతో భరోసా....
గడిచిన మూడు వేవ్‌లను ఎదుర్కొన్న అనుభవంతో కరోనా కట్టడిపై సర్కార్‌లో భరోసా పెరిగింది. మరోవైపు ఒమిక్రాన్వేరియంట్ల వ్యాప్తిని గతంలో గమనించిన నేపథ్యంలో , ఈసారి ప్రభుత్వం కూడా లైట్ తీసుకున్నది. కొత్త ఆంక్షలు, ప్రణాళికలు వంటివేమీ ప్లాన్చేయలేదు. గ్రూప్గేదరింగ్స్పై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకులేదు. వాస్తవానికి ఈ పార్టీలు, సెలబ్రేషన్స్ద్వారా వైరస్వ్యాప్తి ఎక్కువగా జరుగుతుంది. దీంతోనే గతంలో గ్రూప్గేదరింగ్స్ను కట్డడి చేశారు. తద్వారా కొత్త ఇన్‌ఫెక్షన్ల సంఖ్య తగ్గి, వ్యాప్తిని కంట్రోల్చేశారు. మూడో వేవ్సమయంలో హైకోర్టు కూడా జనాలు గుమిగూడకుండా ఆంక్షలు విధించాలని సూచించింది. కానీ ఈసారి అలాంటి నిర్ణయాలేవీ లేకపోవడం ఊపిరి పీల్చుకునే అంశం. ఇక న్యూ ఇయర్ తర్వాత సంక్రాంతి పండుగ వాతావరణం వస్తుంది. దీంతో గ్రేటర్హైదరాబాద్నుంచి అన్ని జిల్లాలు, రాష్ట్రాలకు రాకపోకలు జరుగుతాయి. ట్రైన్లు, బస్జర్నీలలో జనసమూహాలు ఏర్పడి వైరస్వ్యాప్తికి కారణమవుతాయి. కానీ ఈసారి వీటిపై కూడా ఆంక్షలు విధించలేదు. ఇతర దేశాల్లో వైరస్అలజడి కనిపిస్తున్నా..మన దగ్గర ఎలాంటి అలర్ట్లేదంటే ప్రభుత్వం వైరస్రాదనే అభిప్రాయంలో ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతున్నది.
''ప్రశాంతంగా జరుపుకోండి: డా జీ శ్రీనివాసరావు ,హెల్త్ డైరెక్టర్
న్యూ ఇయర్, సంక్రాంతి పండుగలను ప్రశాతంగా జరుపుకోవచ్చు. కరోనాపై ఎలాంటి ఆంక్షలు లేవు. ఇతర దేశాల్లో వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ వేరియంట్లను మనం గతంలో సులువుగా ఎదుర్కొన్నాం. దీంతో టెన్షన్పడాల్సిన అవసరం లేదు. వైద్యశాఖ స్టాఫ్‌కు కూడా రిస్ట్రిక్షన్లు పెట్టలేదు. పండుగ నేపథ్యంలో ఇళ్లకు వెళ్లినోళ్లంతా కరోనా గురించే భయాందోళన పడొద్దు. దీర్ఘకాలిక రోగులు, ఇతర హైరిస్క్గ్రూప్లు కరోనా జాగ్రత్తలు తీసుకోవడం బెటర్. ''