'భగత్ సింగ్‌కు భారత రత్న అవార్డ్ ప్రకటించాలి'

Update: 2023-09-28 10:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రతీ యువకుడు భగత్ సింగ్ చరిత్ర చదవాలని శివసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీ పిలుపునిచ్చారు. నేడు భగత్ సింగ్ జయంతి సందర్భంగా సింకారు శివాజీ మాట్లాడారు. భగత్ సింగ్‌కు భారత రత్న అవార్డ్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. స్వాతంత్ర్య సంగ్రామంలో ఉరి కొయ్యలను ముద్దాడిన గొప్ప దేశ భక్తుడికి ఇప్పటికి భారత రత్న ఇవ్వకపోవటం దారుణమైన విషయమని ఆవేదన వ్యక్తం చేశారు.

భగత్ సింగ్ గురువు లాలా లజపతిరాయ్ మరణంతో చావుకు ఎదురెల్లిన భగత్ సింగ్ మొదటి సారి బ్రిటిష్ అసెంబ్లీ పైన బాంబులు విసిరి, తెల్ల దోరలకు భయం అంటే ఏ విధంగా ఉంటుందో పరిచయం చేసిన భరత మాత ముద్దు బిడ్డ భగత్ సింగ్. తెల్ల దోరలకు వ్యతిరేకంగా స్వాతంత్ర్య సంగ్రామంలో యువత పెద్ద ఎత్తున ముందుకు రావడానికి కారణం కూడా అతడే అంటు తెలిపారు. భారత ప్రభుత్వం భగత్ సింగ్‌కి భారత రత్న అవార్డ్ ప్రకటించకపోతే భగత్ సింగ్‌ను అవమానించినట్టు బావిస్తామని స్పష్టం చేశారు.

Similar News