Shakambari : మీరాలం అమ్మవారి ఆలయంలో శాకాంబరి పూజలు
మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర దేవాలయంలో ఆలయ కమిటీ చైర్మన్ గాజుల అంజయ్య ఆధ్వర్యంలో బుధవారం శాకాంబరి పూజలు ఘనంగా జరిగాయి.
దిశ, చార్మినార్ : మీరాలం మండి శ్రీ మహంకాళేశ్వర దేవాలయంలో ఆలయ కమిటీ చైర్మన్ గాజుల అంజయ్య ఆధ్వర్యంలో బుధవారం శాకాంబరి పూజలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారి విగ్రహంతో పాటు ఆలయాన్ని 15 క్వింటాళ్ల వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, వివిధ రకాల పూలతో సుందరంగా అలంకరించారు. అమ్మవారి విగ్రహంతో పాటు ఆలయాన్ని దొండకాయ, వంకాయ,
క్యాప్సికం, ఆలుగడ్డ, దొండకాయ, పచ్చి మిర్చి, టమాట, కాకరకాయ, బెండకాయ, ఆకుకూరలు, నిమ్మకాయలు, క్యారెట్ క్యాబేజీ, అడవి కాకర కాయ, వివిధ రకాల పుష్పాలు, వివిధ రకాల పండ్లు, తులసి ఆకులతో సుందరంగా తీర్చిదిద్దారు. నిజాం కాలం నుంచి నగరంలోని ప్రజలకు అన్ని రకాల కూరగాయల సరఫరాకు ప్రధాన కేంద్రంగా ప్రసిద్ది చెందిన మీరాంమండిలో శ్రీ మహంకాళి దేవాలయం ప్రతి ఆషాఢమాసంలో బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ గాజుల అంజయ్య తెలిపారు.