Secunderabad:సబ్ రిజిస్ట్రార్ జ్యోతి అరెస్ట్.. రిమాండ్
సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతిని పోలీసులు అరెస్ట్ చేశారు.
దిశ, వెబ్ డెస్క్: సికింద్రాబాద్ సబ్ రిజిస్ట్రార్ జ్యోతి(Secunderabad Sub Registrar Jyoti)ని పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశపెట్టారు.దీంతో ఆమెకు ధర్మాసనం 14 రోజులపాటు రిమాండ్(Remand) విధించింది. ఈ మేరకు జ్యోతిని జైలుకు తరలించారు. కాగా పద్మజారెడ్డి అనే మహిళ జీడిమెడ్ల(Jeedimetla)లోని సుభాష్‌నగర్‌లో 200 గజాల స్థలాన్ని ఫేక్ డాక్యుమెంట్లతో కబ్జా చేశారు. అయితే పద్మాజారెడ్డికి అప్పట్లో కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్‌గా ఉన్న జ్యోతి సహకరించారని ఆరోపణలు వినిపించాయి. నకిలీ పత్రాలతో ల్యాండ్ రిజిస్ట్రేషన్(Land Registration)చేయించుకున్నారని పద్మాజారెడ్డిపై బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఆమెను అరెస్ట్ చేశారు. విచారణలో జ్యోతి సహకరించిన విషయం వెలుగులోకి రావడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. మంగళవారం మధ్యాహ్నం జ్యోతిని అరెస్ట్ చేశారు.