హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ బ్రాండింగ్ హక్కులు సాధించిన ఎస్బీఐ...
భారతదేశ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ బ్రాండింగ్ హక్కులను సాధించింది.
దిశ, మియాపూర్ : భారతదేశ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ బ్రాండింగ్ హక్కులను సాధించింది. ఎస్బీఐ ఛైర్మెన్ దినేష్ ఖరా సోమవారం హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ లో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎస్బీఐ ఛైర్మెన్ ఖారా మాట్లాడుతూ హైటెక్ సిటీ మెట్రో బ్రాండింగ్ హక్కులు పొందడం చాలా సంతోషంగా ఉన్నది. అదే విధంగా మెట్రో రైల్ ప్రాజెక్టులోనే పేరెన్నిక గన్న ఎల్ అండ్ టీతో భాగస్వామ్యం ఏర్పడడం మాకు చాలా ఉత్సాహన్నిచ్చింది.
ఈ బ్రాండింగ్ హక్కులతో విస్తృతంగా ప్రచారం చేసుకొనే అవకాశం కలుగుతుందని అశాభావం వ్యక్తం చేస్తున్నాను. అంతకుమునుపు కార్యక్రమాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించి అనంతరం ప్రపంచ పర్యావరణ దినం పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణకు భాగంగా స్టేషన్ లో ఏర్పాటు చేసిన ప్లాస్టిక్ రీ సైక్లింగ్ యంత్రాన్ని ప్రారంబించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీఐ, ఎల్ అండ్ టీ అధికారులు పాల్గొన్నారు.