రౌడీ షీటర్ వీరంగం…ఓ కుటుంబం పై కత్తితో దాడి
తమ బంధువును రోడ్డు ప్రమాదంలో గాయపరిచాడన్న కక్ష్యతో ఓ రౌడీ షీటర్ ఆ కుటుంబం పై కత్తితో దాడి చేసి గాయపరిచిన ఘటన ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
దిశ, చార్మినార్ : తమ బంధువును రోడ్డు ప్రమాదంలో గాయపరిచాడన్న కక్ష్యతో ఓ రౌడీ షీటర్ ఆ కుటుంబం పై కత్తితో దాడి చేసి గాయపరిచిన ఘటన ఫలక్‌నుమా పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఫలక్‌నుమా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ... సంజయ్ గాంధీ నగర్, నవాబ్ సాబ్ కుంట కి చెందిన వహాబ్ కమాటిపురా మీదుగా కారులో ప్రయాణిస్తుండగా మార్గమధ్యలో ఎదురుగా బైక్ పై వచ్చిన 19 సంవత్సరాల యువకుడు కారును ఢీ కొట్టి గాయపడ్డాడు. దీంతో యువకుడి కాలుకు గాయాలయ్యాయి. వెంటనే షాహిన్ బేగం మొహమ్మద్ అంజద్‌కు సమాచారం అందజేశారు. అంజద్ జరిగిన విషయాన్ని గఫార్ ఖాన్‌కు చెప్పాడు. వెంటనే గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
అయితే గఫార్ ఖాన్‌కు కామాటిపురా పోలీస్ స్టేషన్ రౌడీ షీటర్ అసద్ నుంచి కాల్ వచ్చింది. అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు చంపేస్తానని బెదిరించాడు. అదే రోజు రాత్రి 11.15 గంటలకు ఇంటి వద్ద నిలబడిన గఫార్ ఖాన్ వద్దకు రౌడీషీటర్ అసద్ మరో నలుగురు వ్యక్తులతో కలిసి వచ్చాడు. వెంటనే గఫార్ ఖాన్‌పై కత్తులతో దాడి చేశారు. అసద్ ను అడ్డుకోవడానికి ప్రయత్నించిన గఫూర్ ఖాన్ సోదరుడి కుమారులు జుబైన్ ఖాన్,సోహైల్ ఖాన్,సోదరి కుమారులు షోయబ్, అతని సోదరుడు రహీం ఖాన్ లపై కూడా అసద్ కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో జుబైన్తో పాటు సోహైల్ ఖాన్, మొహమ్మద్ షోయబ్, రహీమ్ ఖాన్లకు గాయాలయ్యాయి. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫలక్‌నుమా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.