హుక్క పార్లర్ పై పోలీసుల దాడి...
హైదరాబాద్‌లోని హబీబ్ నగర్‌లో “దుబాయ్ శీషా లాంజ్” తరహాలో ఉన్న ఒక హుక్కా పార్లర్ పై సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ దాడి చేసి కస్టమర్లను అదుపులోకి తీసుకున్నారు.
దిశ, కార్వాన్ : హైదరాబాద్‌లోని హబీబ్ నగర్‌లో “దుబాయ్ శీషా లాంజ్” తరహాలో ఉన్న ఒక హుక్కా పార్లర్ పై సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ దాడి చేసి కస్టమర్లను అదుపులోకి తీసుకున్నారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత విశ్వసనీయ సమాచారం మేరకు కమిషనర్ టాస్క్ ఫోర్స్, సెంట్రల్ జోన్ టీమ్, నాంపల్లి యూసుఫ్ దర్గా వద్ద హోటల్ మెరిడియన్ పార్క్, షాప్ పైన ఉన్న "దుబాయ్ షీషా లాంజ్" శైలిలో ఉన్న హుక్కా పార్లర్ పై దాడి చేశారు. మొఘల్‌పురాకు చెందిన, మహమ్మద్ సుల్తాన్ 29 హుక్కా సెంటర్ నిర్వాహకుడు. చార్మినార్ ప్రాంతానికి చెందిన షేక్ ఏజాజ్ (21) హూక్కా సెంటర్ వర్కర్, ఫలక్ నామాకు చెందిన షేక్ సాజిద్ (21) హుక్కా పార్లర్ కార్మికుడితో పాటు 13 మంది కస్టమర్‌లు పట్టుబడ్డారు. కాగా నిందితుడు ఇమ్రాన్ పరారీలో ఉన్నాడు. "దుబాయ్ షీషా లాంజ్" యజమాని, అతను వినియోగదారులకు హుక్కా కుండలను అందిస్తూ చట్టవిరుద్ధంగా హుక్కా పార్లర్‌ను నడుపుతున్నాడు. అంతే కాకుండా మైనర్ అబ్బాయిలను కూడా హుక్కా తాగడానికి అనుమతిస్తున్నాడని పోలీసులు తెలిపారు.
హుక్కా కుండల కోసం అధికధర వసూలు చేయడం ద్వారా అక్రమ లాభాలను పొందడంతో పాటు హుక్కా కుండలను వడ్డించడం ద్వారా నికోటిన్‌ను కలిగి ఉన్న హుక్కా రుచులను కదుపుతున్నట్లు పేర్కొన్నారు. విశ్వసనీయ సమాచారం పై కమిషనర్ టాస్క్ ఫోర్స్, సెంట్రల్ జోన్ ఎస్సై.నవీన్ కుమార్ బృందంతో కలిసి హుక్కా సెంటర్ పై దాడులు నిర్వహించి వారిని పెట్టుకున్నారు. హుక్కా 30 కుండలు, పైపులు 25, అల్ అక్బర్ బొగ్గు పెట్టెలు 72 చిన్న పెట్టెలు, చిల్లమ్స్ 31, ఒక రిజిస్టర్, రూ.8,880/- నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులను, స్వాధీనం చేసుకున్న సొత్తును విచారణ నిమిత్తం ఎస్‌హెచ్‌ఓ హబీబ్ నగర్ పీఎస్‌కు అప్పగించారు. ఈ కేసులో హుక్కా సెంటర్ యజమాని ఇమ్రాన్ పరారీలో ఉన్నాడు. టాస్క్ ఫోర్స్ డిప్యూటీ కమీషనర్ రాధా కిషన్ ఆధ్వర్యంలో సీఐ రఘునాథ్, ఎస్సై నవీన్ కుమార్, సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్, సిబ్బంది ఈ దాడిలో పాల్గొన్నారు.